కాలేజి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆదేశం

Spread the love

సాక్షిత : సికింద్రాబాద్ లో ఆదర్శవంతంగా అభివృద్ధి కార్యకలాపాలు : ఎంఎల్ఏ గాదరి కిషోర్ ప్రశంసలు
సికింద్రాబాద్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ క్యాంపు కార్యాలయాన్ని ఎం ఎల్ ఏ గాదరి కిషోర్ సందర్శించారు. కార్యాలయం కర్యలాపాలు, సెట్విన్ సంస్థ పనితీరును ఆయనకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వివరించారు. సికింద్రాబాద్ లో వివిధ అభివృద్ధి కార్యకలాపాలు సాగుతున్న తీరు ఆదర్శవంతంగా నిలుస్తోందని గాదరి కిషోర్ ఈ సందర్భంగా ప్రశంసించారు. కాగా సితాఫలమండీ లో కొత్తగా రూ.30 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ప్రభుత్వ స్కూల్, కాలేజి భవనాల నిర్మాణం, రూ.13 కోట్లతో నిర్మించనున్న కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సమీక్షించారు. విద్యా రంగంలో చేయుతకు కృషి చేస్తూ, రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా జూనియర్, డిగ్రీ కాలేజి సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్ లో మంజూరు చేయించామని, ఈ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ భవనాల నిర్మాణానికి రూ.29.75 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించామని అయన ఈ సందర్భంగా తెలిపారు. సికింద్రాబాద్ తో పాటు నగరంలో ఆదర్శంగా నిలిచేలా సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని సితాఫలమండీ లో ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త భవనాల నిర్మాణం పనులు సాద్యమైనంత తొందరగా ప్రారంభించాలని అయన ఈ సందర్భంగా సూచించారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, నేతలు లింగాని శ్రీనివాస్, కరాటే రాజు, కంది నారాయణ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page