లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల నిధులతో చేపట్టనున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , చందానగర్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , పోలీస్ అధికారులు మరియు సంబంధిత జిహెచ్ఎంసి అధికారులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటట్ రాగం నాగేందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా చిన్న పాటి వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి గోపి చెరువు నీరు, ఎగువ నుండి వచ్చే వరద ప్రవాహానికి అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోతున్నందున తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడం జరుగుతుందని, దీంతో ప్రజలు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న దృశ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి శాశ్వత పరిష్కారం కొరకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి పనులు శేరిలింగంపల్లిలో భవిష్యత్తులో మరెన్నో రానున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, వార్డ్ మెంబర్లు శ్రీకళ, కవిత, పర్వీన్ బేగం, సీనియర్ నాయకులు, బస్తీ అధ్యక్షులు, యువ నాయకులు, బూత్ కమిటి మెంబర్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, మహిళా నాయకురాలు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.*