5వ రోజు పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై చేస్తున్న పాదయాత్రలో భాగంగా డివిజన్ పరిధిలోని చక్రదరి కాలనీ, కాకతీయ నగర్, వెంకటపాపయ్య నగర్, ఉజ్జయిని మహంకాళి నగర్ కాలనీలలో జిఎచ్ఎంసి అధికారులు మరియు స్థానిక వాసులతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి పనులన్నీ దాదాపు తొంభై శాతం పూర్తైయ్యాయని అన్నారు. కాలనీలలో కొంతమేర పెండింగులో ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల పనులను తొందరలో పూర్తిచేస్తామని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి ఎటువంటి సమస్యలు ఉన్నా పాదయాత్రలో భాగంగా నోట్ చేసుకుని త్వరలో పూర్తిచేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.

వెంకటపాపయ్య నగర్ మరియు ఉజ్జయిని మహంకాళి నగర్ కాలనీలలో విద్యుత్ వోల్టేజ్ సమస్య ఉందని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు మరియు అందించిన సంక్షేమ పథకాలను ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందించడం జరిగింది.

కార్యక్రమంలో జిఎచ్ఎంసి అధికారులు ఎఇ శ్రావణి, UBD నాగరాణి, వాటర్ వక్స్ రవీందర్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ నరేష్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, వెంకట్ నాయక్, రాందాస్ గౌడ్, జనార్దన్, నాగేశ్వరరావు, రమేష్ గౌడ్, చాగంటి అశోక్, సైదులు, పాండు, వై.శ్రీనివాస్, మధు, రామకృష్ణ రెడ్డి, ప్రజ్వల్ ముదిరాజ్, మల్లికార్జున్, బాలరాజు, చిన్న శివయ్య, రాంమోహన్, మోహన్ చౌదరి, శ్రీనివాస్, రామేశ్వరరావు, శ్రీకాంత్, కృష్ణ, ఆర్.వి రమణ, మహేష్, రాము, షౌకత్ అలీ మున్నా, యాదగిరి, బాలస్వామి, రాములుగౌడ్, మల్లేష్, సిద్దయ్య, సతీష్, భిక్షపతి, సాయిగౌడ్, సంతోష్ బిరాదర్, కూర్మయ్య, దేవేందర్, బాబు నాయక్, ఎత్తారి శ్రీను, ప్రకాష్, వెంకటేష్, నాగరాజు, ఉమేష్, జనయ్య, అజ్జస్, రాజ్యలక్ష్మి, శిరీష సత్తుర్, షేక్ బీబీ, స్వరూపా, రేణుక, సురేఖ, నస్రీన్, నిర్మల, వనజ, శోభారాణి, పర్వీన్, బి.లక్ష్మీ, దేవి, కృష్ణవేణి, నాగలక్ష్మి, జిఎచ్ఎంసి అధికారులు, ఆర్.పిలు, సమాఖ్య లీడర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page