శాస్త్రవేత్త శ్రీ గెలీలియో సేవలు చిరస్మరణీయంవిద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సుడోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డిసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫిఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా

Spread the love

శాస్త్రవేత్త శ్రీ గెలీలియోసేవలు చిరస్మరణీయం
విద్యార్థులకు వాతావరణ కాలుష్యం పై అవగాహన సదస్సు
డోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డి
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి
ఫిబ్రవరి 15 న ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో జయంతి సందర్బంగా

డోన్ పట్టణం పాతపేటలోని జడ్పీహెచ్ స్కూల్
నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్కూల్ హెచ్ ఎం యం. వెంకటసుబ్బారెడ్డి అధ్యక్షతన శాస్త్రవేత్త శ్రీ గెలీలియో గారి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్. ఎస్. బాబు, పివిఆర్. ప్రసాదరావు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం.వెంకటసుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు ఎన్ ఎస్. బాబు, పివిఆర్. ప్రసాదరావు,సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని డోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం.వెంకటసుబ్బారెడ్డి సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు
శ్రీ గెలీలియో గారు ఫిబ్రవరి 15 – 1565 ఇటలీ లోని పిసా నగరం లో జన్మించారు. ఈయన ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త,గణితజ్ఞుడు,
భౌగోళికశాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త.టెలీస్కోపు(దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర
ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.
గెలీలియో మొట్టమొదటి నాణ్యత గల టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోరియా మహారాజు వెనిస్ కు రమ్మని కబురంపాడు కూడా! ఆయన టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్య పడ్డారు. వెనిస్ చర్చి పైభాగానికి వెళ్ళీ ఎంతో దూరంలో ఉన్న నౌకలను పది రెట్లు దగ్గరగా ఎంతో మంది గెలీలియో టెలిస్కోప్ ద్వారాచూడగలిగారు. ఆయనను ప్రశంసించారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది.ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు.
బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు.గెలీలియో అప్పుడే కనుగొన్న
టెలిస్కోపుద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధృవీకరించారు. మన పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు.ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతంను బలపరిచాడు. క్రీ.శ 1616 లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని తెలియజేశారు.1642, జనవరి 8 తేదీన తన 78వ ఏట అనారోగ్యం తో మరణించారు. శాస్త్రీయ వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసిన ఇలాంటి మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు అనేక పరిశోధనలు చేసి దేశానికి సేవ చెయ్యాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ,డోన్ పాతపేట జడ్పీహెచ్ స్కూల్ హెచ్ ఎం యం.వెంకటసుబ్బారెడ్డి కోరారు. అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి విద్యార్థులకు పలు ఆంశాల పై అవగాహణ కలిగించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా దోమకాటు నుంచి వచ్చేవిష జ్వరాల నుంచి కాపాడుకోవచ్చని తెలియజేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. వాతావరణ కాలుష్యానికి హానికరమైన ప్లాస్టిక్ నిరోధించాలి. ప్లాస్టిక్ ని వాడకుండా మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవాలి. విరివిగా మొక్కలు నాటి మహావృక్షాలుగా తయారు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పరిరక్షణ – ఓజోన్ పొరను రక్షించుకోవాలని తెలిపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించాలి. క్రమం తప్పకుండా సరైన సమయానికి టీకాలు వేయించాలి. చిన్నప్పుడు నుంచే పౌష్టికాహారాన్ని తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఇంట్లో చేసే ఆహార పదార్థాలకంటే.. బయటదొరికే ఫాస్ట్ ఫుడ్స్‌ ఆహారం ఎక్కువగా తింటున్నాము. అయితే వాటిని భద్రపరిచే పేపర్స్ వ్రాపర్స్‌తో ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. అలానే ఈ ఫాస్ట్ ఫుడ్స్ భద్రపరిచే కవర్లు, ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాలు మనం తీసుకునే ఆహారం ద్వారా జీర్ణాశయంలో చేరి అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయని ఇటీవలే సర్వేల ద్వారా తెలియజేశారని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. కల్తీ ఆహర పదార్థాల పై అవగాహణ కల్గి ఉండాలి. కల్తీ నివారణలో , కాలుష్య నివారణలోను సామాజికంగా ప్రతి ఒక్కరు భాగస్వాములై కల్తీ ఆహారపదార్థాలను నివారించుకుని ,కాలుష్యం లేని గాలి (ఆక్సిజన్ ) తో మన ఆరోగ్యాలను కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. ఆహారాన్ని వృధా చేయకుండ మన సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేసుకుని ఆరోగ్యాలను కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ పాటించాలి. తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలి. మన దేశాన్ని మన సంస్కృతి సంప్రదాయాలను, మన పూర్వీకులను ప్రేమించాలి. మూఢనమ్మకాలపై నిరంతరం అవగాహనతో ఉండాలి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో పట్టణాల్లో వ్యాధులతో బాధపడుతున్నటువంటి పేషెంట్లు స్వామీజీలు మంత్రాలు తంత్రాలు అంటూ తిరుగుతూ వ్యాధి తీవ్రతను ఎక్కువ చేసుకుంటున్నారు. వారిని అవగాహనతో వైద్యశాలకు తరలించే విధంగా చైతన్య పరచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.మన మీద మనకు నమ్మకం ఉంచుకోవాలి. పేదల పట్ల, నిరక్షరాశ్యుల పట్ల, రోగుల పట్ల సేవా భావం కలిగి ఉండాలని తెలిపారు. స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కువ వాడకుడదని తెలిపారు. ఎక్కువగా వాడటం ద్వారా జ్ఞాపకశక్తి తగ్గడం, అసహనం, చిరాకు లాంటి పలు రకాల సమస్యలతో పాటు అది వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. మరణించిన తర్వాత నేత్రదానం, బ్రెయిన్ డెడ్ ,యాక్సిడెంటు అయినటువంటి కేసులలో అవయవాల దానం చెయ్యవచ్చు. ప్రస్తుత సమాజంలో అవయవదానం అవసరం చాలా ఎక్కువ అగుచున్న తరుణంలో ప్రజల్లో విశృత స్థాయిలో అవగాహణ అవసరమని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశం. ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. కొన్న వ‌స్తువుకు బిల్లు తీసుకోవాల‌ని, ఐఎస్ఐ మార్క్ క‌లిగిన వ‌స్తువుల‌ను ఎంపిక చేసుకోవాల‌ని, తూనిక‌లు, కొల‌త‌ల విష‌యంలో కూడా జాగ్ర‌త్త వ‌హించాల‌ని, వ‌స్తు సేవ‌ల్ని పొందేట‌ప్పుడు ఏవైనా ఇబ్బందులు ఎదురైన‌ప్పుడు వినియోగ‌దారుల ఫోర‌మ్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా న‌ష్ట‌ప‌రిహారం పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. నిజ జీవితంలో ఇటువంటి ముఖ్య‌మైన అంశాల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌డంతో పాటు మ‌న చుట్టూ ఉన్న‌వారిని కూడా చైత‌న్య‌వంతులుగా చేయ‌డం సామాజికంగా ప్రతి ఒక్కరి బాధ్య‌త‌గా గుర్తించాల‌ని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు. లింగ నిర్ధారణ నివారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రస్తుత సమాజంలో బాలికల సంఖ్య తగ్గుతున్నది. మహిళా నిష్పత్తి తగ్గటం వల్ల ప్రమాదకర భవిష్యత్‌ను సూచిస్తుందని లింగపరంగా అసమతుల్య స్థితి ఉంటే సమాజంలో అనేక ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. ఆడ మగ ఇద్దరూ సమానమేనని, లింగ వివక్ష చూపడం నేరమేనని తెలియజేశారు. ఆడబిడ్డలను పుట్ట నిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం అలాగే బాల్య వివాహాలు చేయకూడదని తెలియజేశారు. పిల్లలతో పని చేయించడం చట్టరిత్య నేరం. పిల్లలను బడిలో చేర్పించాలి. బాలలను బడిలో చేర్పించకుంటే దేశం అంధకారానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారని ఎవరైనా బాల కార్మికులను గుర్తిస్తే వెంటనే 1098 చైల్డ్ లైన్‌ కేంద్రానికి సమాచారం అందించాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.
మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా జీవించాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులను సంప్రదించకుండా నొప్పులు మాత్రలు వాడరాదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.
మీ
పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్ .

Related Posts

You cannot copy content of this page