అనధికార లేఔట్లు క్రమబద్దీకరించుకోండి .

Spread the love
Regulate unauthorized layouts.

అనధికార లేఔట్లు క్రమబద్దీకరించుకోండి .

  • కమిషనర్ అనుపమ అంజలి.

  • సాక్షిత : నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అనధికార లేఔట్లను వెంటనే క్రమబద్దీకరించుకోవాలని కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.
    లేఔట్ల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న వారి లేఔట్లను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి శనివారం కమిషనర్ పరిశీలించారు.

  • ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని కొన్ని లేఔట్లను ఇంకా క్రమబద్దీకరించుకోలేదన్నారు. వాటిని వెంటనే గుర్తించమని ప్లానింగ్ అధికారులను ఆదేశించామన్నారు.
  • భవిష్యత్తు లో కూడా నిర్మాణాలు చేసుకోవాలన్న ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వెంటనే క్రమబద్దీకరణ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం తమకు దరఖాస్తు చేసుకున్న తిమ్మినాయుడు పాళెం, కొత్తపల్లి జనచైతన్య లేఔట్, కొంకచెన్నాయగుంట లేఔట్లను పరిశీలించామన్నారు.

  • కమిషనర్ వెంట అదనపు కమిషనర్ సునీత, సిటీ ప్లానర్ బాల సుబ్రహ్మణ్యం, టి పి బి ఓ ధర్మరాజు, ప్లానింగ్ సెక్రటరీ లు తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page