PPE కిట్ల ను 593 మంది పారిశుధ్య సిబ్బందికి

Spread the love
PPE kits to 593 sanitation workers

సాక్షిత : శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, భారతి నగర్ డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో డీసీ వెంకన్న , AMOH నగేష్ నాయక్ , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PPE కిట్ల ను 593 మంది పారిశుధ్య సిబ్బందికి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది తల్లిదండ్రులతో సమానం అని , కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మన పరిసర ప్రాంతాలను ,కాలనీ లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతు,కాలనీ లలో ప్రశాంత వాతావరణం కల్పించుట కోసం పని చేస్తున్నారు అని, ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రంగా చేస్తూ నిత్య శ్రామికులు గా పనిచేస్తున్నారు అని , పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేస్తారు అని వారి సేవలను కొనియాడారు.

అదేవిదంగా ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాడమే కాకుండా వారి ఆరోగ్యము కూడా మన బాధ్యత అని పారిశుధ్య కార్మికులను,ఎంటమాలజీ, పారిశుధ్య సిబ్బంది ని కాపాడుకోవాలనే ధ్యేయం తో ముఖ్యమంత్రి కేసీఆర్ సహృదయంతో ఆరోగ్య పరిరక్షణకు PPE కిట్ల ను 593 మంది సిబ్బందికి అందచేయడం జరిగినది అని , పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య భద్రతే మన భద్రత అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ PPE కిట్ల బ్యాగ్ లలో రెయిన్ కోర్ట్ , టోపి మాస్క్ లు , శాని టైజర్లు , కొబ్బరి నూనె ,సబ్బులు ,షూస్ ,హాండ్ గ్లౌస్ లు వంటి 11 రకాల వస్తువులు ఉంటాయి అని, వీటిని సద్వినియోగ పర్చుకొని విధి నిర్వహణ లో ఆరోగ్యము గా ఉండాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మరియు విధుల్లో ఉన్న‌ప్పుడు జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా రక్షణ కిట్లు ధ‌రించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు. ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. కిట్లను అందుకున్న కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ విప్ గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో పారిశుధ్య సూపర్ వైజర్ జలందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు జనార్దన్ రెడ్డి,కర్ణాకర్ గౌడ్, కొండల్ రెడ్డి తెరాస నాయకులు, కార్యకర్తలు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page