Ponnamaneni Mallesh Yadav appointed as Rajendranagar Assembly convener
బీజేపీ రాష్ట్ర పార్టీ తెలంగాణ లోని నియోజకవర్గాలకు అసెంబ్లీ కన్వీనర్ లను నియమించడం జరిగింది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గా ప్రేమవతిపెట్ కు చెందిన పొన్నమనెని మల్లేష్ యాదవ్ నీ ప్రకటించింది.
ప్రకటన వచ్చిన అనంతరం నియోజకవర్గ కార్యాలయం లో రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన పొన్నమనేని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ మొదట గా నాపై ఎంతో నమ్మకం తో ఈ మహోత్తరమైన బాధ్యతను నాకు అప్పచెప్పడం చాల సంతోషకరంగా ఉందని, బీజేపీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, దేశం కోసం, ధర్మం కోసం, పని చేసే పార్టీ, అని 1988 సంవత్సరం లో దివంగత స్వర్గీయ బండి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యం లో పార్టీ సభ్యత్వం తీసుకున్నాను,
సామాన్య కార్యకర్త గా చేరి 1990 లో రాజేంద్రనగర్ మున్సిపల్ బిజేవైఎం కార్యవర్గ సభ్యునిగా, 1993 లో మున్సిపల్ బిజేవైఎం కార్యదర్శి గా, 1996 లో మున్సిపల్ బిజేవైఏం ప్రధాన కార్యదర్శి గా, 1998 లో మున్సిపల్ బిజేవైఎం అధ్యక్షులుగా, 2001 లో బీజేపీ రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యవర్గ సభ్యులుగా, 2005 లో బీజేపీ మున్సిపల్ కార్యదర్శి గా, 2008 లో రంగరెడ్డి జిల్లా బిజేవైఎం కార్యవర్గ సభ్యులుగా, 2011 లో రంగరెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యునిగా, 2014 లో రాజేంద్రనగర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి గా, 2015 లో జిల్లా డైరీ సెల్ కన్వీనర్ గా, 2020 లో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు
నిర్వహించిన నన్ను ఇప్పుడు 2022 లో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కి జిల్లా రూరల్ మరియు అర్బన్ బీజేపీ అధ్యక్షులు సామ రంగారెడ్డి బొక్క నరసింహారెడ్డి కు ప్రధాన కార్యదర్శి వై.శ్రీధర్, చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ నారగుడేం మల్లారెడ్డి, జిల్లా బీజేపీ కార్యదర్శి మోండ్ర కొమరయ్య,
జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి రాచూరి రాజశేఖర్ కు, జిల్లా మరియు నియోజకవర్గ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్న అని, బడుగు బలహీనర్గాలకు పెద్ద పీట వేసే ఏకైక పార్టీ బీజేపీ అని, నాకు అప్పగించిన ఈ బాధ్యతను మనసా వాచా నూటికి నూరు శాతం ప్రతి కార్యకర్తను కలుపుకుని నియోజకవర్గం లో పార్టీ నీ బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో పార్టీ నీ గెలిపించేందుకు నా శాయ శక్తులు కృషి చేస్తానని
, నాకు వెన్నంటి ఉండి నన్ను ఆశీర్వదించి అన్నివిధాల సహకిరించిన సీనియర్ నాయకులకు నా తోటి నాయకులకు మరియు నియోజకవర్గం లోని బీజేపీ ప్రతి కార్యకర్త కు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అని అన్నారు.
ఇట్లు
రాచూరి రాజశేఖర్
బీజేపీ అధికార ప్రతినిధి
రంగారెడ్డి అర్బన్ జిల్లా
సెల్:- 9581316363.