పక్షవాతంతో బెడ్ కు పరిమితమైన పెన్ననర్ల ఎంపికను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
పక్షవాతంతో మంచానికి, కుర్చీకి పరిమితమైన పెన్ననర్ల ఎంపికను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పక్షవాతంతో ను, ఏదైనా ప్రమాదవశాత్తు, 80 శాతం వికలత్వం ఉన్న వారికి 15000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ముఖ్యంగా మంచానికి, వీల్ చైర్లకు పరిమితమైన వారికి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 52 మంది ఉన్నారన్నారు. వీరి పెన్షన్ ను పెంచేందుకు మరోమారు ఒక ఆర్థో పెడిసియన్, ఒక జనరల్ మెడిసినర్, ఒక మెడికల్ ఆఫీసర్ల తో కూడిన బృందంతో తనిఖీ చేస్తున్నామని అన్నారు. వీరి ఎంపిక పూర్తి అయిన తరువాత ప్రభుత్వం 15వేల రూపాయల పెన్షన్ ఇస్తుందని అన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వైద్యుల బృందం, సచివాలయ కార్యదర్శులు, అన్నారు.