మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద జరుగుతున్న చెరువు కట్ట మరమత్తు పనులు

Spread the love

మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద జరుగుతున్న చెరువు కట్ట మరమత్తులను మరియు గండి పూడ్చే పనులను మరియు అలుగు స్థితిగతులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ శ్ర ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా పటేల్ చెరువు కట్టకు గండి పడిన విషయం విషయం విదితమేనని, గండి పూడ్చి, కట్ట యథాస్థితికి తీసుకురావడం జరిగినది అని, కట్ట మరమ్మత్తుల పనులు వేగవంతం చేయాలని, కట్టను పతిష్టపర్చాలని, మళ్ళీ పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,చెరువు కట్టను మరింత పటిష్టపరిచేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ,పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, వర్షాకాలం నేపథ్యంలో అధికారులందరు అప్రమాత్రంగా ఉండలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

అదేవిధంగా నాలలకు రక్షణ చర్యలలో భాగంగా ఫెన్సింగ్ వేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, నాల మరియు ముంపు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండలని ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు తెలియచేసారు. అదేవిదంగా వర్షకాలం ను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని,పెండింగ్ పనులలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలనీ చెప్పడం జరిగినది

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE నళిని మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, హరి తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page