“జనప్రవాహంలా కదిలిన పాలేరు- నూతన ఉత్తేజం తో తుమ్మల

Spread the love

“Paleru, who moved like a crowd – sneezes with renewed enthusiasm

జనప్రవాహంలా కదిలిన పాలేరు- నూతన ఉత్తేజం తో తుమ్మల

లోడిగ. వెంకన్నయాదావ్. సామాజిక వేత్త-పాలేరు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జనగుండెల్లో నిలిచి నేతలకు ఏవిధంగా ప్రజలు నీరాజనాలు పలుకుతారో అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు ఆత్మియసమ్మేళనం సందర్భంగా నిరూపణ జరిగింది. 40 సంవత్సరాల తుమ్మల రాజకీయ జీవిత ప్రస్తానం పురస్కరించుకుని అభిమానులు ఆరెంపుల శ్రీసిటిలో నూతసంవత్సరం ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేసి కేవలం సెల్ ఫోన్ సమాచారం, సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్ఛారు.

పిలిచిందే తడువుగా తుమ్మల అభిమానులు పాలేరు జనసంద్రంగా మారింది. ఖమ్మం జిల్లా నలుమూలల నుండి తుమ్మల అభిమానులు రాగా, ఖమ్మం రూరల్ , తిరుమనాయపాలెం, కూసుమంచి ,నేలకొండపల్లి మండలాల్లో అత్యధిక మంది పాల్గొన్నారు. ఇప్పుడు పదవి లో లేకపోయినా, యంయల్ఏ కాక పోయిన తుమ్మల 40 సంవత్సరాలు ఖమ్మం జాల్లాకు చేసిన సేవకు గుర్తింపు గా ప్రత్యేకించి ఖమ్మం ,పాలేరులో చూపిన అభివృద్ధి ప్రతీఒక్కరిని కదిలించేలా చేసింది. ఏవక్కరు ఎలాంటి ఏర్పాట్లు చేయక పోయిన సొంత ఏర్పాట్లు చేసుకొని రావటం విశేషం.

పాలేరు నియోజకవర్గ మునుండి ఎవరూ వెళ్ళవద్దు అని చెప్పనా , పనికట్టుకొని కొందరిని నివారించిన , ఎవరూ వెళ్ళుతున్నారో ప్రతీ ఊరిలో నిఘాపెట్టీ చూసినా కొంతమంద పనికట్టుకొని ప్రజలను వెళ్ళవద్దు అని చెప్పినా పాలేరు ప్రజలు వినలేదు. జనప్రబంజనంలో పాలేరు ప్రజలే అత్యధికముగా ఉండటం విశేషం. ఆత్మీయ సమ్మేళనం నిర్వహకులు 25 వేల నుంచి 30 వేలమంది ని అంచనా వేసి ఏర్పాట్లు చేసుకొన్నారు. కాని లెక్కకు మించి ఊహించని జనం వచ్ఛేసరికి నిర్వహకులు సంబరమాశ్చర్యం లో మునిగి పోయారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిఘావిభాగం వారు కూడ నిర్వహకుల అంచనాలకు మించి ప్రజలు ఆత్మీయసమ్మేళన సభ వచ్ఛారని , సభ విజయవంతం అయింది అని ప్రభుత్వానికి నివేదిక ఇచ్ఛినట్టుగా తెలుస్తోంది.


ఇంతమంది జనం ఒక ప్రవాహం లా వచ్ఛినా, అంచనాలకు మించి జనం అత్మీయసమ్మేళనంను విచ్ఛేసినా ఎలాంటి లోటు లేకుండా నిర్వహకులు తగు జాగ్రత్త వహించారు. మంచినీరు , వంటసామాను ,ఆహరం , విషయంలో ముందుచూపుతో అప్రమత్తంగా ఉండి ఎలాంటి లోటురాకుండా చూసుకొన్నారు.ఇది గొప్పవిషంగా చెప్పవచ్చు. విశాలమైన టెంట్లు ,భోజనం వడ్డించే కౌంటర్ లు అవసరానికి మించి ఏర్పాట్లు చేయటం , శాఖహర ,మాంసహార విడివిడిగా ఏర్పాట్లు చేడం ,ఏ కౌంటర్ దెగ్గర జనం రద్దీ తక్కువగా ఉందో చూసి వచ్ఛినవారిని ఏకౌంటర్ దగ్గరకు వెళ్ళొలో వచ్ఛే జనానికి సూచనలు ఇచ్ఛి ఎప్పటికప్పుడు వాలెంటరీలు అప్రమత్తం చేయటం వలన ప్రశాంతంగా భోజనం చేయడానికి వీలుకలిగింది.

పిలువగానే అందుబాటులో కి వచ్ఛే పలు వంటసామగ్రీ , వాటిని అందుబాటులో కి తెచ్ఛే యంత్రాంగం సిద్దం చేసుకొనడంవల నిర్వకులు సక్సెస్ కాగలిగారు అని చెప్పవచ్చు. 25వేల నుండి 30 వేల వరకు ముందు గానే నిర్వకులు అంచనా వేసుకోవడం వలన అంచనా కు మించి ప్రజలు తండోప తండాలుగా వచ్ఛినా ఎలాంటి కొరత రాకుండా ప్రశాంతంగా ,విశాలమైన ప్రాంతంలో , రుచికరమైన వంటకాలతో సంతృప్తి కరంగా భోజనం చేయగలిగారు..

ఉదయం11గంటల కే భోజనాలు వడ్డించడం ప్రారంభించడంతో ఎక్కువ మంది తినే సౌలభ్యం జరిగింది. ఇది పూర్తిగా పాలేరు నియోజకవర్గ బాద్యులు , అభిమానులు ఏర్పాటు చేయడం విశేషం. తుమ్మల 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి ఏర్పాట్లు తొలిసారిగా చూస్తున్నాము అని ప్రతీఒక్కరు చెప్పుకోవడం, ముచ్ఛటించు కోవటం వినిపించింది. నిర్వహకులు పార్కింగ్ సదుపాయం చేసినప్పటికి సామర్థ్యాన్ని మించి వాహనాలు ఎక్కువగా రావటం వలన ,వరుస క్రమంలో వాహనాలు పయనించక పోవటం వలన రద్దీపెరిగి సుమారు శ్రీసిటిలో రెండు గంటలు ఎటుపోవాలో అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది.

అయినా నిర్వకులు సమస్యను గుర్తించి వాహనాలు బైటనే నిలిపివేసి ట్రాఫిక్ ని రెండు గంటల్లో క్రమబద్ధీకరణ చేయడం విశేషం. వరంగల్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది
ఖమ్మం పట్టణ ప్రెవేటు విద్యసంస్థల అధిపతులు ఒకే సారి సమిష్టి గా వేదిక వద్దకు రావడం ,మాజీ యంయల్ఏ చంద్రావతి గిరిజన సంప్రదాయం దుస్తులతో , బిందెలు కడవలతో తుమ్మలకు అభినందనతో శుభాకాంక్షలు తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఖమ్మం రూరల్ తెల్దారుపల్లి ప్రజలు తమ్మినేని కృష్ణయ్య కుమారుడు ప్రదర్శన తో నినాదాలతో సభ హోరెత్తించారు. రూరల్ గిరిజన దాండియా డ్యాన్స్ లతో ఒకే రంగు కండంవా ,తలపాగా ధరించి గుంపులు గుంపులు గా రావడం సభ ఆకర్షణగా నిలి తుమ్మల ఆనందం ఎంతో సభ సమాంతం వరకు హుశారుగా ,జోష్ గా కనిపించారు. అభివృద్ధిప్రదాత జిందాబాద్, పాలేరు లో మళ్ళీ పోటీ చేయాలి అని నినాదాలు చేస్తుంటే తుమ్మల చేతు ఊపి అభివాదం చేశారు

.
హైదరాబాద్ గండిపేటలో పరిచయం ఉన్న సీనియర్ జర్నలిస్టు షేక్ సలీం తుమ్మల 40 సంవత్సరాలు రాజకీయ జీవితం పై 40 పేజీల పుస్తకం ఆవిష్కరించి. నేను 6ఆరు జిల్లాలో ఇన్చార్జి రిపోర్టర్ గా పని చేశాను కాని తుమ్మలలాంటి అభివృద్ధి ప్రదాతను చూడలేదు అనగానే సభ సప్పట్లతో మారుమోగింది.ఏదిఏమైనప్పటికి స్వార్థం లేకుండా, ప్రజలకు సేవచేయగలిగితే ప్రజలు గుండెల్లో పెట్టుకొంటారు

అని తుమ్మల ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఋజువు చేయబడింది. ఈ ఉత్సాహం ప్రజల నీరాజనం ,అభిమానం నేను బ్రతికి ఉన్నంతకాలం ప్రతలకు సేవచేయాలి అనే ఆత్మవిశ్వాసం తుమ్మలకు కలిగింది.ఈ నూతన ఉత్తేజం కాబోలు అందుకే వెంటనే గోదావరి జలాలు తెచ్ఛి పాలేరు ప్రజల పాదాలు కడిగి రుణం తీర్చుకొంటాను అన్నారు. ప్రజా ఉత్సాహం తో పాలేరు రాజకీయ వేడెక్కింది. ఎన్నికల సందడి మొదలైంది.

Related Posts

You cannot copy content of this page