రావాల్సిన పన్నులు వంద శాతం వసూలు చేయాలి

Spread the love
One hundred percent of the due taxes should be collected

రావాల్సిన పన్నులు వంద శాతం వసూలు చేయాలి – కమిషనర్ అనుపమ అంజలి


తిరుపతి నగరపాలక సంస్థకు రావల్సిన ఇంటి పన్నులు, తాగునీటి చార్జీలు, భూగర్భ మురుగునీటి చార్జీలు వంద శాతం వసూలు చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ఆదేశించారు. నగరపాలక సంస్థ సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు అందరూ కూడా పన్నులు వసూలు పై దృష్టి సారించాలన్నారు.

నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, రెవెన్యూ అధికారులు లోకేశ్వర్ వర్మ, సేతుమాధవ్ లతో నగరపాలక సంస్థలోని పన్నులు వసూలుపై సమీక్ష నిర్వహించారు. ఆస్తిపన్నులు ఇప్పటికే 63 శాతం వసూలు కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

తాగునీటి చార్జీలు, భూగర్భ మురుగునీటిపారుదల చార్జీలు తక్కువ వసూలు చేయడంపై మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉన్నదని గుర్తు చేస్తూ, పన్నుల చెల్లింపు దారులకు అవగాహన కల్పించి సచివాలయంలోనూ అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ల కౌంటర్ ద్వారా మాత్రమే పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.

తిరుపతి నగరాభివృద్ధికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని, పన్ను చెల్లింపుదారులందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించాలని కమిషనర్ అనుపమ అంజలి కోరారు.

Related Posts

You cannot copy content of this page