ప్రజల మన్ననలు పొందే విధంగా సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారు

SAKSHITHA NEWS

Officials who serve in a way that earns the people’s forgiveness will last forever

ప్రజల మన్ననలు పొందే విధంగా సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారు

రాష్ట్ర పౌరసరఫరాల, బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్

 అన్నివర్గాలకు చెందిన ప్రజల మన్ననలు పొందుతూ సేవలందించే అధికారులు చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ, బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రజలకు ఆశించిన ఫలితాలు అందుతాయని తెలిపారు.

బదిలీపై వెళుతున్న పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణకు వీడ్కోలు, నూతనంగాబాధ్యతలు చేపట్టిన పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు లకు స్వాగతం పలుకుతూ శుక్రవారం నాడు కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో ఏర్పాటైన కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ బదిలీపై వెళ్ళిన పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ సమర్ధవంతంగా పనిచేశారన్నారు. దేశానికి ఎంతోమంది మహోన్నతులను అందించడంతోపాటు విభిన్న రకాల కార్యక్రమాలు కొనసాగే కరీంనగర్ పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలని చెప్పారు.

రాజన్న జోన్ డిఐజి కె రమేష్ నాయుడు మాట్లాడుతూ మానవత్వంతో స్పదింస్తూ సేవలందించే అధికారిగా
బదిలీ వెళ్ళిన కమీషనర్ గుర్తింపు పొందారన్నారు.

బదిలీపై వెళ్ళిన పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ సాహసోపేతమైన చర్యలతో అందించన సేవలతో కమీషనరేట్ వ్యాప్తంగా శాంతియుత వాతావరణం ఏర్పడిందన్నారు. అన్నిస్థాయిలకు చెందిన అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ సందర్భోచితంగా వ్యవహరించాలని చెప్పారు. సంతృప్తికరంగా విధులను నిర్వహించానని, సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

నూతన పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తనకు సుపరిచత ప్రాంతమే అయినందున ప్రజాప్రతినిధులు, అన్నిశాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో పనిచేస్తానన్నారు.

బదిలీపై వెళుతున్న పోలీస్ కమీషనర్ కు మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, వివిధశాఖలకు చెందిన అధికారులు జ్ఞాపికను అందజేసి, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు, చొప్పదండి ఎమ్మేల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్లతో పాటుగా డిసిపి (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్, ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, వెంకటరెడ్డి, మదన్ లాల్, జె విజయసారధి, కె శ్రీనివాస్, సి.ప్రతాప్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లులతోపాటుగు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఘనంగా వీడ్కోలు

బదిలీ పై వెళ్ళిన పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణను కమీషనరేట్ లోని అన్నిస్థాయి లకు చెందిన అధికారులు కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్మారకస్తూపం వద్ద నుండి ప్రధాన ప్రవేశ ద్వారా వరకు ఓపెన్ టాప్ వాహనంలో ఎక్కించి గౌరవార్ధం సదరు వాహనాన్ని తాళ్ళతో లాగుతూ వీడ్కోలు పలికారు

    కమిషనర్ ఆఫ్ పోలీస్
              కరీంనగర్

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSCM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర రాజనర్సింహ. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు…


SAKSHITHA NEWS

SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSSOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవలను మనసులో ఉంచుకోవాలిజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవలను మనసులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…


SAKSHITHA NEWS

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You Missed

CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 21 views
CM సచివాలయంలో పంచాయత్ రాజ్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 28 views
SOLDIERS సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని, వారి సేవ

SARPANCH మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 25 views
SARPANCH మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

KARNATAKA కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 25 views
KARNATAKA కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

KONDAKAL కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 26 views
KONDAKAL కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా వన మహోత్సవం

CYBER సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న 3.4 లక్షలు గంట వ్యవధిలో

  • By sakshitha
  • జూలై 26, 2024
  • 27 views
CYBER సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్న 3.4 లక్షలు గంట వ్యవధిలో

You cannot copy content of this page