గ్లోబల్ షో టో కా న్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్

Spread the love

SK Jalil, President of Karimnagar District Association of Global Show To Ka n Karate Do India

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో గ్లోబల్ షో టో కా న్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో

భారతదేశపు మొట్టమొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయులు చదువుల తల్లి ఫాతిమా షేక్ గారి 192 వ జయంతి కార్యక్రమం స్థానిక ఉర్దూ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి అతిధులు విచ్చేసిన.తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ .బి ఆర్ ఎస్ వై జిల్లా ప్రధాన కార్యదర్శి & మాజీ ఏఎంసి డైరెక్టర్ మొహమ్మద్ ఖలీద్ హుస్సేన్. మహాత్మ జ్యోతిరావు పూలే కమిటీ చైర్మన్ కొలిపాక సమ్మయ్య గార్లు పాల్గొన్నారు.

అనంతరం అతిథులు మాట్లాడుతూ సింథియా ఫర్రార్ అనే అమెరికన్ మిషనరీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో ఇద్దరూ చేరినప్పుడు ఫాతిమా షేక్ .సావిత్రిబాయి ఫూలేను కలిశారు . వీరిద్దరి ఆలోచన విధానం ఒకే రకంగా ఉండడం వలన సమాజంలో జరుగు జరుగుతున్నటువంటి వివక్ష మహిళలను అగ్రవర్ణాలు చేసే దాడులు మహిళలు చదువుకోవద్దని ఆంక్షలు ఆనాటి సమాజంలో దృఢంగా నిలిచాయి వాటికి వ్యతిరేకంగా సావిత్రిబాయి పూలే మొట్టమొదటి పాఠశాల పూణేలో ఏర్పాటుచేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే అయితే అధ్యాపకులుగా ఫాతిమా షేక్ గారు విద్యార్థులకు విద్య ను బోధించడం జరిగింది అదేవిధంగా జ్యోతిరావు పూలే స్థాపించిన పాఠశాలలు వాటి అన్నింటిలో సావిత్రి రావ్ పూలే ఫాతిమా షేక్ గారు కీలక పాత్ర పోషించారు.

వారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ మహిళలు సాధికారక సాధించాలంటే అది కేవలం అది కేవలం విద్యతోనే సాధ్యమవుతుందని గట్టిగా దృఢ సంకల్పంతో వెనుకడుగు వేయకుండా మహిళల్ని చైతన్య పరిచే విధంగా సావిత్రిబాయి పూలే గారు ఫాతిమా షేక్ గారు ఈ దేశానికి సేవ చేశారని గుర్తు చేశారు. దుండగులు దాడి చేసిన వారి దాడిని ప్రతిఘటించి వారి జీవితం మొత్తం మహిళల విద్యాభ్యాసం వితంతుల పునర్వివాహుల చట్టం సావిత్రిబాయి పూలే గారితో కలిసి ఉద్యమాలు జరిపి వితంతు పునర్వివాహ చట్టాన్ని అమలుపరిచే విధంగా కృషి చేసినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు వారి సేవలను గుర్తించి మహారాష్ట్రలోని పాట్నా ప్రాంతంలో పాఠశాలను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు.

15వ వార్డు అధ్యక్షులు బీఆర్ఎస్ ఉప్పు 14 వార్డ్ అధ్యక్షులు బీఆర్ఎస్ గంట మధు 17వ వార్డు అధ్యక్షులు బీఆర్ఎస్ షేక్ అహ్మద్ .బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిర్జా జియావుల్లా బేగ్. షేక్ బాబా. ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు. నవీన్. మరియు విద్యార్థిని విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page