సనత్ నగర్ లోని హిందూ పబ్లిక్ స్కూల్ లో తరుణ్ చుగ్ తో కలిసి ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొన్న సంజయ్

Spread the love

Sanjay participated in the ‘Pariksha Pe Chircha’ along with Tarun Chugh at Hindu Public School in Sanat Nagar.

మీకు మీరే పోటీ పడండి

ఇతరులతో పోటీ పడి టెన్షన్ పడకండి

సమాజానికి ఉపయోగపడేలా చదువుండాలి

తల్లిదండ్రులారా… ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి తేవొద్దు

మీ టెన్షన్ తొలగించడానికే ‘పరీక్షా పే చర్చ’

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్య

సనత్ నగర్ లోని హిందూ పబ్లిక్ స్కూల్ లో తరుణ్ చుగ్ తో కలిసి ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొన్న సంజయ్

పరీక్షల సమయంలో విద్యార్థి తనకు తానే పోటీ పడాలే తప్ప ఇతరులతో పోటీ పడి టెన్షన్ కు గురై అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచించారు. ఉద్యోగాలు చేయడానికే చదువును పరిమితం చేయొద్దని, జ్ఝానాన్ని పెంచేదిగా, సమాజానికి చేకూరేదిగా చదువు ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు సైతం పరీక్షల సమయంలో ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి తేవొద్దని, ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా మోటివేట్ చేయాలని కోరారు. పరీక్షల సమయంలో విద్యార్థుల, తల్లిదండ్రుల ఒత్తిడి తగ్గించేందుకు ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమన్నారు.

• సనత్ నగర్ లోని హిందూ పబ్లిక్ స్కూల్ వద్ద జరిగిన పరీక్షా పే చర్చలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంప బండి సంజయ్ కుమార్, రాష్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, పరీక్షా పే చర్చ కన్వీనర్ పాపారావు, గుండగోని భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యార్థులకు బండి సంజయ్, తరుణ్ చేతుల మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రచించిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని, సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• దేశంలో ఏ ప్రధానమంత్రి అయినా పరీక్షల్లో పిల్లలు పడే టెన్షన్ గురించి ఎన్నడైనా ఆలోచించారా? మీలో టెన్షన్ తగ్గించి ఆత్మవిశ్వాసం పెంచడానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయమే ‘పరీక్షా పే చర్చా’. మీ టెన్షన్ ను తొలగించడానికి ప్రధాని ప్రయత్నించడం గొప్ప విషయం.

• పరీక్షలంటే పిల్లలకు, తల్లిదండ్రులకు మాత్రమే టెన్షన్ కాదు… ర్యాంకుల కోసం కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు టెన్షన్ పడుతుంటాయి. నా ద్రుష్టిలో ఆయా స్కూళ్లు వేస్ట్. బాగా చదివే పిల్లలను వంద మందిని సెలెక్ట్ చేసి ఒక రూంలో వేసి రంపం లెక్క గీకుతరు. తీరా పరీక్ష టైం వచ్చేసరికి పేపర్ లీక్ చేస్తరు. వాళ్లందరినీ దగ్గరుండి ప్రత్యేకంగా కార్ లో ఎగ్జామ్ సెంటర్ వద్దకు తీసుకెళ్లి… పరీక్ష సమయాని కంటే అరగంట ముందే హాల్లో కూర్చోపెట్టి లీక్ చేసిన ప్రశ్నాపత్రం ఇచ్చి రాయిస్తరు. ముందే ర్యాంకులను కూడా కొంటారు. నేను కరీంనగర్ లో అలాంటి వాటిని చూసిన. అట్లాంటి ర్యాంకులు అవసరమా?

• అందుకే తుగ్లక్ సంపాదకులు చో రామస్వామి ఒక మాటన్నడు… సామాజిక జ్ఝానం లేని ఫస్ట్ ర్యాంకర్ కంటే థర్డ్ ర్యాంకు విద్యార్థినే నేను ఇష్టపడతానన్నడు. మార్కుల కోసమే కాకుండా సబ్జెక్టును పూర్తిగా అవగాహన చేసుకుని జ్ఝానాన్ని పెంచుకునేందుకు చదవండి. అప్పుడు ఆటోమేటిక్ గా మార్కులొస్తాయి.

• అంతేగాని మార్కుల కోసం ఇతరులతో పోటీ పడి చదవకండి. ఇతరులతో పోటీ పడితే మైండ్ ఒత్తిడికి గురైతది. మానసికంగా దెబ్బతింటం. పరీక్ష టైంలో ఆరోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి మీరంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రిపేర్ కండి.

• మీకై మీరే పోటీ పెట్టుకోండి. ఎట్లా అంటే వేగంగా చదవడం విషయంలో … అర్ధం చేసుకోవడంలో… ఉదాహరణకు… ఒక ప్రశ్నకు ఆన్సర్ ను తొలిసారి 15 నిమిషాల్లో చేశారనుకొండి.. నెక్స్ డే 10 నిమిషాల్లోనే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోండి… తరువాత 5 నిమిషాల్లోనూ కంప్లీట్ అయ్యేలా చూడండి… అప్పుడు మీలో మీకే ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పరీక్షను ఈజీగా రాయగలననే ధైర్యం కూడా వస్తుంది.

• మీకో ఎంగ్జాంపుల్ చెబుతా…. సెర్గయి బుబ్ కా అనే ఉక్రెయిన్ అథ్లెట్ కు ప్రపంచంలోనే స్పెషల్ రికార్డు ఉంది. అదేంటంటే.. పోల్ వాల్టర్ (పెద్ద కర్ర సాయంతో హైజంప్ చేయడం) గేమ్ లో 35 సార్లు తన రికార్డును తానే అధిగమించిండు. తొలుత 6 మీటర్లతో రికార్డు స్రుష్టిస్తే.. ఆ తరువాత 7… నెక్స్ట్ 8 మీటర్ల చొప్పున అధిగమిస్తూనే ఉన్నడు. కానీ ఏనాడూ వేరే వాళ్లతో పోటీ పెట్టుకోలే…

• ఒకసారి ప్రధాని మోడీ గారు ఐఐటీ కాన్పూర్ వెళ్లి మీరేం చేస్తారని అడిగితే… ఒకడు అమెరికా, ఇంకోడు బ్రిటన్, యూరప్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తామన్నడట… వెంటనే మోదీ గారు మీ దగ్గరున్న కంప్యూటర్ ఓపెన్ చేసి గూగుల్ లో భారత్ విదేశాల నుండి ఏయే ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటుందో వాటికి సంబంధించి టెక్నాలజీని డెవలెప్ చేయండి. ఆ టెక్నాలజీతో ఇండియాలోనే పరిశ్రమలు పెట్టండి తప్ప ఐఐటీలో చదివిన వారు కూడా ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు.

• మీరు పెట్టే ఇండస్ట్రీ ద్వారా కోటి రూపాయలు ఉత్పత్తి అయినా అది దేశం కోసం చేస్తున్న సేవగా భావించాలని అన్నారు. దాని నుండి పుట్టుకొచ్చిందే మేక్ ఇన్ ఇండియా, దాని నుండి పుట్టిందే ఆత్మ నిర్భర్ భారత్… మేక్ ఇండియాతో ఈరోజు ఇండియా స్టార్టప్ ల హబ్ గా మారింది. గుండు సూది మొదలు ఆర్మీ ఆయుధాలు, రాకెట్లు సహా శాటిలైట్ విజ్ఝానాన్ని సైతం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. కరోనా వ్యాక్సిన్ 100 దేశాలకు పైగా ఎగుమతి చేసినం. ఆయుధాలను ఎగుమతి చేసినం.
• దయచేసి పిల్లలు టెన్షన్ పడకండి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ర్యాంకుల కోసం ఒత్తిడి తేవొద్దు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో చేరి లక్షలు సంపాదించాలని టెన్షన్ పెట్టొద్దు. బట్టీ పట్టి మార్కులు కోసం
చదవించకుండా సబ్జెక్టును అవగాహన అయ్యేలా జ్ఝానం సంపాదించి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయించండి.

• చదువు సమాజానికి ఉపయోగపడాలి. సార్థకత ఉండాలి. టీచర్లు గొప్పోళ్లు. వాళ్ల పిల్లలను వదిలేసి స్కూల్ వచ్చి మీకోసం కష్టపడుతుంటరు. తాను చదువు చెప్పిన విద్యార్థులకు ర్యాంకులొస్తే ఖూషీగా ఫీలైతరు.
• ఒకబ్బాయి బాగా చదివి యూఎస్ పోయిండు. వాళ్ల అమ్మ చనిపోతే రాలేదు. ఖర్మ రోజు వచ్చిండు. కార్యక్రమం అయ్యాక వెళ్లిపోయిండు. నేను ఫోన్ చేసి మీ నాన్న బాగుండా.. యాడ ఉన్నడంటే… వ్రుద్దాశ్రమంలో వేసిన అన్నడు. నెలకు రూ.10 వేలు కడుతున్నా అన్నడు… ఇది తప్పు కదా? వాళ్ల పిల్లలు పెద్దయ్యాక ఏం చేస్తరు? వాళ్లను కూడా వ్రుద్దాశ్రమంలోనే వేస్తారు.

• అందుకే పిల్లలకు చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పాలి. హిందూ ఆశ్రమ పాఠశాలల్లో హరి ఓం అంటారు. మీరు కూడా జై శ్రీరాం.. హరి ఓం అనాలి. పెద్దలకు చేతులెత్తి నమస్కరించాలి.

• నరేంద్రమోదీ గారు నిర్వహిస్తున్న మన్ కీ బాత్ ద్వారా ఎంతో మంది పిల్లల్లో మార్పు వచ్చింది. తక్కువ మార్కులొచ్చినా జ్ఝానంతో మా పిల్లలు ఉన్నత స్థానానికి చేరుకున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు ప్రధానికి లక్షల కొద్దీ లేఖలు రాశారు. అందుకే పరీక్షా పే చర్చ పేరుతో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలి.

• మీరంతా మంచి విషయాలు నేర్చుకుని జ్ఝానం పెంచుకోవాలి. మీ తల్లిదండ్రుల ఆలోచనలను గౌరవించాలి. నిండు నూరేళ్లు శక్తి సామర్థ్యాలతో, ఆయురారోగ్యాలతో సక్సెస్ సాధించాని కోరుతున్నా..

తరుణ్ చుగ్ వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు..

• ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోజుకు 19, 20 గంటలు పనిచేస్తారు. నిత్యం ఎనర్జీతో ఉంటారు. విదేశాల్లో పర్యటనలు చేసి తెల్లవారుజామున మేం స్వాగతం పలకడానికి వెళ్లినప్పుడు సైతం ఎనర్జీతో కన్పిస్తారు…

• విద్యార్థులు… మీరు టెన్షన్ పడకండి. కష్టపడండి. మీరు ఎగ్జామ్ వారియర్స్. ఒత్తిడికి గురైతే పరీక్ష సరిగా రాయలేరు. ఆత్మ విశ్వాసంతో ప్రశాంతంగా రాయండి. 135 కోట్ల జనాభా కలిగి ఉన్న భారత్ ను విశ్వ గురుగా తీర్చిదిద్దేందుకు మోదీ చేస్తున్న క్రుషిలో మీరు భాగస్వాములుకండి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page