సేద్య విభాగంలో ప్రారంభమైన ప్రదర్శన….. సాయంత్రం సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శన….
-వృషభరాజాల ప్రదర్శన తిలకించేందుకు వేలాదిగా రైతులు, ప్రజానికం తరలిరావడంతో కోలాహలంగా కే కన్వెన్షన్ ప్రాంగణం….
గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నాని-కొడాలి చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న ఎన్టీఆర్ 2 వైయస్సార్ జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన మూడవ రోజుకు చేరుకున్నాయి. సేద్య విభాగంలో జరుగుతున్న ప్రదర్శనను ఎన్టీఆర్ 2 వైయస్సార్ ట్రస్టు సభ్యులు వల్లురుపల్లి సుధాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రదర్శనలో పాల్గొన్న పశుపోషకులకు సుధాకర్ జ్ఞాపికలు అందజేశారు. ఉదయం సేద్య విభాగం, సాయంత్రం సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శనలు జరుగుతాయని ట్రస్టు సభ్యులు తెలియచేశారు.ఎడ్ల ప్రదర్శనను తిలకించేందుకు గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో రైతులు,ప్రజానీకం తరలి రావడంతో కే కన్వెన్షన్ ప్రాంగణం కోలాహలంగా మారింది. ట్రస్టు సభ్యులు పాలడుగు రాంప్రసాద్, వల్లభనేని బానుప్రకాష్, ప్రదర్శనల రిఫరీ రాధాకృష్ణ ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ట్రస్టు సభ్యులు ప్రదర్శనను పర్యవేక్షిస్తున్నారు.