
దేశ ప్రజల దిశా మార్చిన బడ్జెట్
రైతులు, సామాన్య ప్రజలకు ఊరట
కేంద్ర బడ్జెట్ అద్భుతం………….*
బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మున్నూరు రవీందర్ హర్షం
సాక్షిత వనపర్తి
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశ ప్రజల దిశ మార్చే విధంగా ఉందని ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు ముఖ్యంగా రైతులకు మేలు చేస్తుందని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సీనియర్ న్యాయవాది మున్నూరు రవీందర్ అన్నారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఎనిమిదవ సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమని అన్నారు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పిందని ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు
వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ లో సడలింపు 36 ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రద్దు బీమా రంగంలో ఎఫ్ డీఐ 100% వరకు పెంచడం వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెట్టడం గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సౌకర్యం కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం. జరిగిందని ఆయన తెలిపారు, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు గతంలో ఉన్న మూడు లక్షల పరిమితిని ఏకంగా ఐదు లక్షల పెంచడం రైతుల పట్ల బిజెపి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నిరూపించడం జరిగిందని ఆయన అన్నారు,
అంతేకాక మధ్యతరగతి ప్రజలకు కేంద్రం నిజమైన తీపి కబురు చెప్పిందని 12 లక్షల వరకు పన్ను మినహాయించి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అని అన్నారు, అంతే కాక దేశంలోని ప్రతి జిల్లా కేంద్రాలలో గల ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాన్సర్ సెంటర్స్ ను ఏర్పాటు చేసేందుకు ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకోవడం కూడా పేద ప్రజలకు వైద్య పరంగా ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు, విద్య ,వైద్యం వ్యవసాయ రంగం ,పైన సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులను అందించడం ఎస్సీ ఎస్టీ మహిళలకు ఔత్సాహిక పారిశ్రామిక వేతల కింద రెండు కోట్ల రుణాలు మంజూరు చేస్తూ ఈ బడ్జెట్లో గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు,
అంతే కాక తపాలా శాఖ అంగన్వాడి కేంద్రాలకు కొత్త హంగులు ప్రభుత్వ పెట్టుబడుల పెంపకం ఎమ్ ఎస్ ఎం ఈ లకు 20 లక్షల కోట్ల రుణాలను ఇవ్వడం తో పాటు రైతులకు వడ్డీ రైతు కింద ఐదు లక్షల విలువ చేసే క్రెడిట్ కార్డులు అందజేయడం మొత్తం 27 కీలక రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత కల్పించడం మామూలు విషయం కాదని అన్నారు ఎన్నో అంచనాలు మరెన్నో ఆశల నడుమ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా మున్నూరు రవీందర్ హర్షం వ్యక్త చేశారు, మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట కల్పించే విధంగా ఈ బడ్జెట్ రూపు దిద్ది ప్రజల ముందు ఉంచడం దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన ఈ బడ్జెట్ ను జీర్ణించుకోలేని టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేయడం బాధాకరమని అన్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం అప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు, బడ్జెట్కు ప్రతి ఒక్కరు సహకరించాలని అభినందనలు తెలుపాలని ఆయన సూచించారు,

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app