SAKSHITHA NEWS

మే నుంచి రైతు భరోసా: సీఎం చంద్రబాబు

ఏపీలో తమది పేదల ప్రభుత్వమని సీఎం చంద్రబాబు అన్నారు. మే నుంచి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా రూ.4వేల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏడాదికి రూ.48 వేలు లబ్ధిచేకూరుస్తున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని వివరించారు. ప్రతి ఇంట్లో ఐటీ ఉద్యోగి ఉండేలాచేయడం తమ కోరిక అని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app