మా నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూములు మాకే-ఎంపీపీ వైయస్సార్

Spread the love

అసమర్ధ మంత్రి మల్లారెడ్డి నిర్వాకం వల్లనే బయటవారికి కేటాయించారు

  • అర్హులైన స్థానిక పేదలకు ఇండ్లను కేటాయించాలని డిమాండ్
  • మంత్రి మల్లారెడ్డి సహకారంతో కమిషన్లు తీసుకొని ఇళ్లను కేటాయించారు
  • కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఇండ్లను నిర్మించి కెసిఆర్ నిర్మించాడని అబద్దపు మాటలు

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన డబల్ బెడ్ రూములను స్థానీకులకే ఇవాలని బిజెపి ఘట్కేసర్ మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు విక్రం రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు,రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు ఘట్కేసర్ మండల సుదర్శన్ రెడ్డి బిజెపి నాయకులతో కలిసి అర్హులైన స్థానికులకే కేటాయించాలని నిరసన వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం లో 80,000 మంది దరఖాస్తు చేసుకున్నారని ఇప్పటివరకు వరకు కేటాయించకుండా ఆశ చూపించి ఓటు బ్యాంకు రాజకీయ చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు, పని మనుషులు డ్రైవర్లకు, ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని డబల్ బెడ్రూంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించారు కాబట్టి పేద ప్రజలలు, ఘట్కేసర్ ఉమ్మడి మండలంలో ఉన్న అర్హులైన అందరికీ కేటాయించేంతవరకు బిజెపి పార్టీ ద్వారా వారికి పూర్తి మద్దతు ఇస్తామని పోలీసులు బిఆర్ఎస్ ప్రభుత్వం కోసం పనిచేయదని పేద ప్రజల కోసం పనిచేయాలని హెచ్చరించి పేద ప్రజలకు డబుల్ బెడ్ రూములు అందజేయడానికి సహకరించాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమర్ మోహన్ రెడ్డి,బోడుప్పల్ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎంపీటీసీ, శోభా రెడ్డి,జిల్లా నాయకులు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయలక్ష్మి,జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పవన్ రెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శిలు శ్రీశైలం, ప్రభంజన్ గౌడ్, వివిధ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page