కల్వర్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం…

Spread the love

కల్వర్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో రూ.88 లక్షలతో చేపడుతున్న కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ , అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కల్వర్టు పూర్తైన వెంటనే డ్రైనేజీ, రాంప్ రోడ్డు పనులకు వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ కృష్ణ చైతన్య, డిఈఈ పాపమ్మ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page