ఇల్లు కూలిన నిరుపేద కుటుంబానికి 1లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందచేసిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

Spread the love

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పురాతన భవనాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి..


సాక్షిత : కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో నివాసం ఉంటున్న వంపుగూడెం శాంతమ్మ పురాతన ఇల్లు నిన్నరాత్రి కూలిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ వారిని పరామర్శించి బాధితురాలి కుటుంబానికి 1లక్ష రూపాయలను ఆర్థిక సహాయాన్నిఅందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులందరూ సమీక్షించుకుంటూ నియోజకవర్గ పరిధిలోని పురాతన భవనాలను గుర్తించి వాటిలో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page