గుడుల వాడగా కీర్తి గడించిన….. గుడివాడ ఆధ్యాత్మిక కీర్తిని మరింత పెంపొందించేలా కృషి – ఎమ్మెల్యే కొడాలి నాని

Spread the love

-శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని….

-నూతన కమిటీ సభ్యులను అభినందించి…. దేవాలయ వైభవాన్ని పెంపొందించేలా కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే కొడాలి నాని

గుడివాడ : గుడివాడ పట్టణంలో విశిష్టత కలిగిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు దేవదాయ శాఖ అధికారులు మన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నానికు వేద ఆశీర్వచనాలు అందజేసిన పేద పండితులు, దేవస్థాన సాంప్రదాయం ప్రకారం గౌరవ సత్కారం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ 240 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో రెండు కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు నేడు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. గుడులకు ప్రసిద్ధి చెందిన గుడివాడలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత , భక్తుల సహకారంతో అనేక దేవాలయాల రూపురేఖలు మార్చటమే కాక, పలు దేవాలయాలను పునాదులతో సహా తొలగించి నిర్మించామన్నారు . దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పంచకర్ల వెంకట్, ధర్మకర్తల కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన పొదిలి సత్యనారాయణ, గానుగుల సరళరేఖ, దారం కాంచన కుమారి, నూకల లక్ష్మీ శివ జ్యోతి, చందల వజ్రలత,లక్కోజు శివ ప్రసాద్ లకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని, చైర్మన్ వెంకట్, కమిటీ సభ్యులను భక్తులు, వైఎస్ఆర్సిపి నాయకులు, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్,గుడివాడ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను,జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళి,జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు,వైసిపి నాయకులు పాలేటి చంటి, చంద్రాల హరి రాంబాబు,ఘంటా చంద్ర శేఖర్,దుడ్డు చిన్నా,తోట శివాజీ,జ్యోతుల శ్రీను,దారం ఏడుకొండలు, గులిపల్లి ప్రభాకరరావు,జిల్లా రఘుబాబు,ఘంటా శ్రీను,డాక్టర్ ఆర్కే,గంట సురేష్, జోగా సూర్యప్రకాష్, రేమల్లి నిలాకాంత్,అల్లం రామ్మోహనరావు,అల్లం సూర్యప్రభ, ముడెడ్ల ఉమా, జొగ నాగేశ్వరరావు, కోంకితల అంజనేయ ప్రసాద్, సింగిరెడ్డి గగారిన్, కలపాల కిరణ్, వెంపల అప్పారావు, ఈవో షణ్ముగ నటరాజన్, పెద్ద సంఖ్యలో భక్తులు, పలువురు పట్టణ ప్రముఖులు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page