అభివృద్ధి సంక్షేమంలో ప్రజాప్రతినిధులు ముందుండాలి: ఎమ్మెల్యే దాసరి

Spread the love

సాక్షిత పెద్దపల్లి జిల్లా: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం…సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే దాసరి
అభివృద్ధి సంక్షేమంలో ప్రజాప్రతినిధులు ముందుండి గ్రామాలను సుందరీ కారణంగా తీర్చిదిద్దాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు. పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కోట్లాది రూపాయలతో గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పని చేస్తున్నారని అన్నారు, గ్రామాలు పట్టుకొమ్మలాంటివని అలాంటి గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయించి గ్రామంలో అన్ని మౌళిక వసతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు

.ప్రతీ గ్రామంలో నిధులు కేటాయించి సీసీ రోడ్ల నిర్మాణం మురుగు కాలువల నిర్మాణం తో పాటు మంచినీటి వసతి కుల సంఘాల భవనాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అలాగే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటిలో లబ్ధిదారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని గడపగడపకు వివరించి ముఖ్యమంత్రి అందించిన సంక్షేమాన్ని ప్రజలకు చూపించాలన్నారు, దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాకుండా అనేక కొత్త పథకాలను ప్రజలకు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గత పాలకులు చేయనటువంటి అభివృద్ధిని ముఖ్యమంత్రి చేపడుతున్నారన్నారు, ప్రతీ గ్రామానికి తారు రోడ్డు సౌకర్యాన్ని కల్పించి ప్రయాణాన్ని మండలకేంద్రం వరకు అలాగే జిల్లా రాష్ట్రస్థాయి వరకు మార్గాలను సుందరీకరంగా తీర్చిదిద్దారన్నారు, గతంలో గ్రామాలలో ఏ చిన్న పని చేయని నాయకులు నేడు తాము చేస్తున్న పనులను ఎత్తిచూపుతున్నారు అన్నారు.


మండల సమావేశంలో పలువురు సర్పంచులు వివిధ శాఖల అధికారులను నిలదీశారు రైతులు పండించిన పంటలో కోతలు విధిస్తున్నారని అవి లేకుండా చూడాలని సభ దృష్టికి తీసుకువచ్చారు,ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గత సమావేశంలో గ్రామంలో ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చిన సర్పంచి ఎంపీటీసీల సమస్యలను సంబంధిత అధికారుల కు వివరించామని వాటిని పరిష్కరించేలా జిల్లా కలెక్టర్కు వివరించామని త్వరలోనే వాటిని పూర్తి చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు అనంతరం పలు సమస్యలపై సభ కొనసాగింది.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, PACS ఛైర్మెన్ లు దాసరి చంద్రారెడ్డి, మాదిరెడ్డి నరసింహా రెడ్డి, వైస్ ఎంపీపీ రాజయ్య,మండల కో ఆప్షన్ హాబీబ్,సర్పంచులు,ఎంపీటీసీలు,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page