వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించిన పువ్వాడ..

Spread the love
Minister Puvvada inspected the construction works of veg and non-veg market.

వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి పువ్వాడ..


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టారు. ఖమ్మం నగరం దినదినాభివృద్ధిచెందుతున్న తరుణంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌మార్కెట్‌ను ఆధునాతనంగా నిర్మించనున్నారు.

ఖమ్మం నగరంలోని ఖానాపురంలో రూ.4.50 కోట్లు, వీడిఓస్ కాలనీలో రూ.4.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మేయర్ పునుకొల్లు నీరజ తో కలిసి పరిశీలించారు.

వీడిఓస్ కాలనీలో గల 2.01ఎకరాల్లో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లో 65-వెజ్ స్టాల్స్, 23-ఫ్రూట్ స్టాల్స్, 46-నాన్-వెజ్ స్టాల్స్ మొత్తం-134 స్టాల్స్ తో అన్ని సౌకర్యాలు ఒకే చోట ప్రజలకు కావలసినవి అందుబాటులో ఉండనున్నాయని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

ఆయా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి కి, సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే చాలా ఆలస్యంగా అయిందని పనుల్లో వేగం పెంచాలని అన్నారు.

మార్కెట్‌ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడలని, ఈ సందర్భంగా మార్కెట్‌ ప్లాన్‌ మ్యాప్‌ను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు.

కార్యక్రమంలో మయోర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఎం ఈ పబ్లిక్ హెల్త్ ఇ ఇ రంజిత్, డి ఇ స్వరూపరాణి, ఏ ఇ నవ్యజ్యోతి, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, నాయకులు పగడాల నాగరాజు, బత్తుల మురళి తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page