డిజిటల్ క్లాస్ రూమ్స్ ను మంత్రి మల్లారెడ్డి

Spread the love

సాక్షిత : నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులు,ఆర్వో ప్లాంట్, ఫర్నిచర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ను మంత్రి మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా

మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ ఎం సి టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ వారి ఆర్థిక సహాయంతో నూతనంగా నిర్మించిన 4 అదనపు తరగతి గదులు,ఆర్వో ప్లాంట్, ఫర్నిచర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ను మంత్రి మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…స్వచ్చందంగా పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావటం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో ప్రేరణగా నిలుస్తాయన్నారు.

సామాజిక సేవలో ఎఫ్ఎంసి సంస్థ ముందుకు వచ్చి 80 లక్షలు వెచ్చించి తరగతి గదులు,ఇతర సదుపాయాలు కల్పించటంతో పాటు సంస్థ ఉద్యోగులు విద్యార్థులతో మమేకం అవ్వటం గొప్ప విషయం అన్నారు.

చదివిన బడి రుణం తీర్చుకోవాలి…సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారు పేద పిల్లలు చదివే పాఠశాలలను దత్తత తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 7300 కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా12 విభాగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ పాఠశాలాల రూపురేఖలు మారుతున్నాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న గురుకులాలకు డిమాండ్ బాగా పెరిగిందని,ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అన్ని పాఠశాలల్లో ఈ విధంగా సీట్ల కోసం పోటీ ఏర్పడుతుందన్నారు.

గురుకులాలల్లో 1150 జూనియర్ కళాశాలలు,80 డిగ్రీ కళాశాలలు,పీజీ,లా కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

విదేశీ విద్యకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు అందిస్తున్నట్లు,ఇప్పటికే 5 వేల మంది విదేశీ విద్యా అభ్యసిస్తున్నారని అన్నారు.

చాలా మంది తల్లిదండ్రులు కేవలం ఇంగ్లీష్ మీడియం కోసమే ప్రయివేటుకు వెళ్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి 1 నుండి 8 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభించారని మంత్రి అన్నారు.

Related Posts

You cannot copy content of this page