సాక్షిత కరీంనగర్ జిల్లా :
అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
కరీంనగర్ సిగలో మరో మణిహారం.. నేడు కేబుల్ బ్రిడ్జి ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
కరీంనగర్లో మానేరుపై 224 కోట్లతో నిర్మాణం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి కేటీఆర్
కరీంనగర్ అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిపై దేశంలోనే తొలిసారిగా డైనమిక్ లైటింగ్ ఏర్పాటు చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇది. మానేరు నదిపై కరీంనగర్ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు.
నాలుగు వరుసలతో 500 మీటర్ల పొడవున నిర్మించిన బ్రిడ్జికి అవసరమైన కేబుల్‌ను ఇటలీ నుంచి తీసుకొచ్చారు. పాదచారుల కోసం రెండువైపులా కలిపి 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మించారు. ఈ బ్రిడ్జిపై నుంచి చూస్తే.. ఒకవైపు మధ్యమానేరు జలాశయంతోపాటు రూ.410 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్‌ఫ్రంట్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. మంత్రి కేటీఆర్ పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననుండగా, కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి గంగుల పర్యవేక్షిస్తున్నారు. కాగా, కేబుల్ బ్రిడ్జి, రాబోయే మానేరు రివర్ ఫ్రంట్ అందమైన ప్రకృతి దృశ్యానికి సరికొత్త వైభవాన్ని ఇవ్వ బోతున్నాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు..,………