ఆగమైతదన్న తెలంగాణను అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్ దే.

Spread the love
KCR is credited with putting Telangana on top.

ఆగమైతదన్న తెలంగాణను అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్ దే..*

  • ప్రజల ఆశీర్వాదం ఉంటే మరింత ప్రగతి చేసి చూపిస్తాం..
  • కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్..

  • రంగా రెడ్డి జిల్లా ప్రతినిధి

కేశంపేట: ఆంధ్రాపాలకుల చెర నుంచి విముక్తి పొంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ గురించి ఆగమవుతదని హేళన చేసిన వారి కళ్ళు తెరిపించేలా దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణను అగ్ర భాగాన నిలిపిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ దేనని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.

కేశంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహశీల్దార్ మీర్ ఆజంఅలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ యాదవ్, జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించి 28మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసి మాట్లాడారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. గతంలో ఆడబిడ్డల వివాహాలు చేయాలంటే తల్లిదండ్రులు అప్పులు చేసేవారని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలతో తల్లిదండ్రులు ఆనందంగా తమ కుమార్తెకు వివాహాలు చేస్తున్నారన్నారు.

భౌగోళికంగా తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం షాద్ నగర్ అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తవుతే మన నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించి మహిళల ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్ మరింత ఇనుమడింప చేశారన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిత్యవసర సరుకులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందన్నారు. కానీ స్థానికంగా ఉండే బిజెపి నేతలు తెలంగాణలో ధరలు పెరిగాయని, ఆ ధరల నేపాన్ని కేసీఆర్ ప్రభుత్వంపై వేసి అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మారుమూల పల్లెల్లోని ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ఏ ఒక్కరి దగ్గరికి వెళ్లి అడిగినా వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను కేంద్రం పెంచుతుందని తమకు చెబుతున్నారంటే ప్రజల్లో ఎంత చైతన్యం ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

అదేవిధంగా కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారు, కొత్తపేట గ్రామానికి చెందిన రైతు మృతిచెందడంతో రూ.5లక్షల రైతు బీమా ప్రొసీడింగ్ ను మృతుడి భార్యకు ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్ర కుమార్ రెడ్డి, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నివేధిత, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, పీఏసీఎస్ కొత్తపేట చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, కేశంపేట సర్పంచ్ వెంకట్ రెడ్డి, కొత్తపేట సర్పంచ్ నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, శేఖర్ పంతులు, ఆయా గ్రామాల లబ్ధిదారులు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page