‘అహింస’ నుండి ‘కమ్మగుంటదే’ పాట విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని

Spread the love

దర్శకుడు తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ ‘అహింస’ నుండి ‘కమ్మగుంటదే’ పాట విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ మెటిరిరియల్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచాయి.

తాజాగా ఈ చిత్రం నుండి ‘కమ్మగుంటదే’ పాటని  నేచురల్ స్టార్ నాని చేశారు. ఆర్పీ పట్నాయక్ ఈ పాటని అందమైన జానపద మెలోడి స్టయిల్ లో కంపోజ్ చేశారు. వినగానే మనసుని ఆకట్టుకునేలా వుందీ పాట.

ఈ పాటలో అభిరామ్, గీతికా ల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. కాల భైరవ, కీర్తన శ్రీనివాస్ ఈ పాటని లవ్లీగా ఆలపించారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు’కమ్మగుంటదే’ పాట కూడా ఫోక్ చార్ట్ బస్టర్ గా అలరిస్తోంది.

ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు.  సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.

ఈ చిత్రం త్వరలోనే థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: అభిరామ్, గీతిక, రజత్ బేడీ, సాధా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు.

తారాగణం: అభిరామ్, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు

Related Posts

You cannot copy content of this page