SAKSHITHA NEWS

Kalyan Lakshmi/Shadi Mubarak Checks distributed by Minister Puvvada.

కళ్యాణలక్ష్మీ/షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

92 చెక్కులకు గాను రూ.92 లక్షల విలువైన చెక్కులు పంపిణీ.

నేటి వరకు 5964 చెక్కులకు గాను రూ.71.12 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నియోజకవర్గ పరిధిలో మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను లబ్దిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీడియోస్ క్యాంపు కార్యాలయంలో స్వయంగా పంపిణీ చేశారు. ఖమ్మం కార్పోరేషన్ -83, రఘునాథపాలెం మండలంలో-9 మొత్తం 92 చెక్కులకు గాను రూ.92 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.

ఖమ్మం నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి ,షాది ముభారక్ పథకం ద్వారా నేటి వరకు 5964 చెక్కులకు గాను రూ.71.12 కోట్ల విలువైన చెక్కులను అందజేయడం గర్వంగా ఉందన్నారు. అనంతరం చెక్కులు అందుకున్న లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.


SAKSHITHA NEWS