ఖమ్మంలో ఘనంగా జరిగిన ఎంపీ రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు

Spread the love

MP Ravichandra’s birthday celebrations were held in Khammam

ఖమ్మంలో ఘనంగా జరిగిన ఎంపీ రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు

బాణసంచా కాల్చుతూ, బ్యాండ్ మేళాల చప్పళ్లు, కేరింతలతో రవిచంద్రకు అపూర్వ స్వాగతం పలికిన యువత

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి.హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఖమ్మం చేరుకున్న ఆయనకు వందల మంది యువకులు బాణసంచా కాలుస్తూ, బ్యాండ్ మేళాల చప్పళ్లు, కేరింతలతో అపూర్వ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఉమ్మడి ఖమ్మం,వరంగల్ జిల్లాల నలుమూలల నుంచి రవిచంద్ర బంధుమిత్రులు,బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు వేల సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి అజయ్, ఎంపీ రవిచంద్రలు కేక్స్ కట్ చేశారు.ఎంపీ వద్దిరాజుకు జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్,సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్,బీఆర్ఎస్ ఖమ్మం నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు శాఖమూరి రమేష్,గుండ్లపల్లి శేషగిరిరావు,జల్లెల శ్రీనివాస్ యాదవ్, మున్నూరుకాపు ప్రముఖులు పారా నాగేశ్వరరావు,ఆకుల గాంధీ,పొదిల రవికుమార్, శెట్టి రంగారావు,తోట రామారావు, పాల్వంచ రామారావు,తీగల విజయ్, రాపర్తి రాజా, గణేష్,మాటేటి రవి,యువతేజాలు చిరంజీవి,భానుప్రతాప్,

గౌరిశెట్టి వినోద్,నలబాల హరీష్,గుమ్మడెల్లి ప్రశాంత్,హరీష్,ఆకుల సాయి,దోసపాటి కిరణ్,అరుణ్ నాయక్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే, పలువురు కార్పోరేటర్స్, పాత్రికేయులు,పోలీసు అధికారులు, న్యాయవాదులు, మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు,బౌన్సర్స్,హీజ్రాలు రవిచంద్రకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.వేద పండితులు ఆశీస్సులు అందజేశారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page