ఢిల్లీలో పోరాడుతున్న రెజ్లర్లకు న్యాయం చేయాలి – ప్రజా సంఘాలపోరాట వేదిక

Spread the love

ఢిల్లీలో పోరాడుతున్న రెజ్లర్లకు న్యాయం చేయాలి – ప్రజా సంఘాలపోరాట వేదిక

నల్లగొండ సాక్షిత ప్రతినిధి

ఢిల్లీలో పోరాడుతున్న రేజర్లకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ లు కోరారు. గురువారం ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో దొడ్డి కోమరయ్య భవన్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్ల్యూ ఎఫ్ ఐ అధ్యక్షుడు మరియు బిజెపి ఎంపీ బ్రీజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద రేజ్లర్లు నిరసన తెలుపుతున్నారు. డబ్ల్యూ ఎఫ్ ఐ చీప్ తో పాటు అందులో పని చేస్తున్న మరికొందరు కోచ్ లు తమ పై లైంగిక వేధింపులు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రముఖ మహిళా రేజ్లర్లు ఫిర్యాదు చేసిన ఢిల్లీ పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం విచారకరమని అన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కూడా స్పందన లేదు అంతర్జాతీయంగా పతకాలు సాధించి దేశానికి గౌరవాన్ని ప్రతిష్టను తెచ్చి పెడుతున్న ఒలంపిక్ పతక విజేతలతో సహా మన అగ్రశ్రేణి క్రీడాకారులు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం బిజెపి ఎంపీ ని రక్షించేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి అఖిలభారత స్థాయిలో ప్రజాసంఘాల నాయకులు వారి ఆందోళనకు మద్దతు తెలిపి దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులపై ఫోక్సో చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ ప్రజా సంఘాల నాయకులు మన్నె శంకర్, కుడ్తాల సైదులు, రేణుక అనిత రమ్య భవాని బొడ్డుపల్లి సైదులు, రఘు ,నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page