ప్రచురణార్థం జగనన్న ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఇవ్వాలని జరుగుతున్న సిపిఐ పోరుబాటను జయప్రదం

Spread the love


Jayapradam the CPI’s campaign to give 5 lakhs for the construction of Jagananna houses for publication

ప్రచురణార్థం జగనన్న ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఇవ్వాలని జరుగుతున్న సిపిఐ పోరుబాటను జయప్రదం చేయండి సిపిఐ
సాక్షిత నంద్యాల జిల్లా

సిపిఐ నక్కీ రామన్న భవనం నందు సిపిఐ పోరు బాట వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రాధాకృష్ణ సిపిఐ మండల కార్యదర్శి ఎస్. పులి శేఖర్ పట్టణ కార్యదర్శి బి నారాయణ లు మాట్లాడుతూ జగనన్న ఇండ్ల నిర్మాణానికి లక్ష ఎనభై వేల రూపాయలు బేస్ మట్టం కట్టుకోవడానికి కూడా సరిపోవడంలేదని అటువంటప్పుడు ఇల్లు ఏ విధంగా కడతారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

స్థలాలు కూడా కొండల్లో గుట్టల్లో వాగుల్లో ఇవ్వడం ద్వారా ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు పేరుకు మాత్రం ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తున్నామని చెప్పి కొండల్లో ఇవ్వడం మంచి పద్ధతి కాదన్నారు తక్షణమే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థలాలు కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి ప్రతి లబ్ధిదారునికి ఐదు లక్షలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

అదేవిధంగా టీట్టుకో ఇళ్లను లబ్ధిదారులకు తక్షణమే స్వాధీనం చేయాలన్నారు అదేవిధంగా పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం కేటాయించాలని వారన్నారు బాధితుల పక్షాన జరిగే సిపిఐ పోరు బాటలో కలిసి రావాలని వారు జగనన్న కాలనీ లబ్ధిదారులకు పిలుపునిచ్చారు వాల్ పోస్టర్ విడుదల చేసిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఆర్ సుగుణమ్మ. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఓబులాపురం నారాయణ.

దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు ప్రభాకర్. సర్పంచ్ జే రవి మోహన్. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ప్రతాప్. ఏఐవైఎఫ్ నాయకులు రణత్. వృత్తుదారుల సమైక్య జిల్లా కార్యదర్శి రామ్మోహన్. మహిళా సమైక్య నాయకురాలు లక్ష్మి దేవమ్మ. నాగప్ప నాయకులు సుధాకర్. రంగస్వామి . దివాకర్ పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page