It is a good scheme among the schemes undertaken by the Telangana government
సాక్షిత : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల్లో ఉన్న మంచి పథకం ఈ కంటి వెలుగు.ఎంతో మంది కంటి సమస్యలకు ఉచితంగా పరిష్కారం లభిస్తోంది అలాగే పెద్దవాళ్లకు కళ్ల అద్దాలు లభిస్తున్నాయి అని ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న మహొత్సర కార్యం.మొదటి విడత ఘనవిజయం అయినా సందర్బంగా రెండవ విడత అదే స్థాయి కంటే ఇంకా రేటింపు విదంగా పెంచి తెలంగాణ రాష్ట్రము వ్యాప్తంగా 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్న సందర్బంగా స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో కాకతీయ నగర్ సొసైటీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ తో కలిసి ప్రారంభించడం జరిగింది.
అనంతరం మల్లికార్జున నగర్ కాలనీ,జిహెచ్ఎంసి పాత కార్యాలయంలో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ స్థానిక నాయకులు,జిహెచ్ఎంసి అధికారులు,హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి లంచనంగా అధికారికంగా ప్రారంభించడం జరిగింది.వారితో సీఎం మల్లేష్,డిప్యూటీ కమీషనర్ బాలయ్య,డాక్టర్ నాగరాజకుమారి,కళ్యాణి,కాలనీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,రఘురాం రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,విట్టల్,కిరణ్ గౌడ్,కాకతీయ నగర్,మల్లికార్జున నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు.