కంటివెలుగును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి…

Spread the love

All people should take advantage of the light of day

కంటివెలుగును ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి…

కుత్బుల్లాపూర్ డివిజన్ లో కంటి వెలుగు శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మ నగర్ ఫేస్-2 వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కంటి పరీక్ష చేసుకున్న వారికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేద, ధనిక, కులమతాల తేడా లేకుండా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా అద్దాలు, అవసరమైతే ఆపరేషన్లు సైతం ఉచితంగా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రతిష్ట, గౌరవం పెంచడంతో పాటు ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. ఈ చక్కటి పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసి మంగతాయారు, ఈఈ కృష్ణ చైతన్య, డిఈఈ పాపమ్మ మరియు మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ,

నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కిషోర్ చారి, మధుసూదన్ చారి, డివిజన్ కార్యదర్శి సత్తిరెడ్డి, యూత్ అధ్యక్షుడు కూన గిరిధర్, అరుణ, జ్యోతి, వెంకటేశ్వరమ్మ, భాస్కర్ రాజు, హన్మంత్ రావు, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, నజీర్, మధుకర్ రెడ్డి, రమణ రెడ్డి, వెంకటేష్, మహేష్, ఖలీల్, సంజయ్, జయం చారి, కృష్ణం నాయుడు, క్రీస్తుదాస్, భాస్కర్ రెడ్డి, విజయ్, పోచయ్య, మచెందర్, బుచ్చిరెడ్డి, దుర్గాప్రసాద్, సురేందర్ రెడ్డి, శంకరయ్య, రవీందర్ రెడ్డి, నరసింహ రెడ్డి, షఫీ, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page