అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

Spread the love

Invitation to Minister KTR for conference in America

అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌: ప్రపంచ పర్యావరణ నీటి వనరుల సదస్సుకు హాజరు కావాలని అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్ ఇంజినీర్స్‌-ఎన్వైర్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌.. మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.

ఇటీవల సంస్థకు సంబంధించిన పలు బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన విధానం, సౌకర్యాలు, వేగంగా నిర్మాణం పూర్తి చేసిన విధానం సంస్థ బృందాన్ని ఆకట్టున్నాయి.

దీంతో ఆ సంస్థ ఎండీ బ్రెయిన్‌ పార్సన్స్‌ మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మే 21 నుంచి 25 వరకు అమెరికాలోని హెండర్సన్‌ నేవడలో జరగనున్న సదస్సులో ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page