తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం

Spread the love

తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం

రూ.4.30 కోట్లతో మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ప్రయోగాత్మక నిర్మాణం

కంటైనర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ లోపలే ఆపరేటింగ్‌ సిస్టం

సీఎం జగనన్న సారథ్యంలో వినూత్న ఆవిష్కరణలకు నాంది.

కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ శ్రీ తలశిల రఘురాం గారు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడి. ది.3.4.2023.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన తొలి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు గొల్లపూడి గ్రామం వేదిక అయింది. స్థలాభావం దృష్ట్యా విద్యుత్తు ఉప కేంద్రాన్ని కంటైనర్ లోనే ఇమిడిపోయే విధంగా ప్రయోగాత్మకంగా దీన్ని నిర్మించారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు, ప్రమాదాల నివారణ దీని ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడిలోని శ్రీనివాస్ నగర్ లో రూ.4.30 కోట్ల వ్యయంతో నిర్మించిన కంటైనర్ విద్యుత్తు సబ్ స్టేషన్ ను రాష్ట్ర విద్యుత్తు, గనుల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు, శాసనమండలి సభ్యులు, గౌరవ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గౌరవ శ్రీ తలశిల రఘురాం గారు సోమవారం సాయంత్రం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కేవలం 13 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈకంటైనర్ సబ్ స్టేషన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సీఎం జగనన్న సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినూత్న ఆవిష్కరణలకు నాంది పలుకుతోందని పేర్కొన్నారు.

సాధారణ సబ్‌స్టేషన్‌కు 20 సెంట్ల స్థలం అవసరం అయితే కంటైనర్‌ సబ్‌స్టేషన్‌కు 2నుంచి 3 సెంట్ల స్థలం సరిపోతుందన్నారు. అంతరాయం లేని విద్యుత్‌ సరఫరాకు వీలుంటుంది. బ్రేక్‌ డౌన్స్‌ ఉండవన్నారు. సిబ్బందికి పూర్తి రక్షణ ఉంటుందన్నారు. సబ్‌స్టేషన్ల పరిధిలో వి­ద్యు­త్‌ లైన్లు తెగిన వెంటనే ట్రిప్‌ అయి సరఫరా నిలి­చి­పోయే వ్యవస్థ ఉందన్నారు. వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుందన్నారు.

నూతన గృహ, వాణిజ్య భవన సముదాయాలతో విస్తరిస్తూ అతివేగంగా అభివృద్ధి చెందుతోన్న గొల్లపూడి ప్రాంత వాసులకు ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు వరమన్నారు. ఈ ప్రాంత ప్రజల బహిరంగ ప్రయోజనాల దృష్ట్యా వెంటనే ఇక్కడ సబ్ స్టేషన్ ను ఏర్పాటుకు సహకరించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page