కల్వకుర్తిలో మన ఇసుక మన వాహనం పేరుతో విచ్చలవిడిగా అక్రమ రవాణా

Spread the love

In Kalvakurti our sand is smuggled promiscuously in the name of our vehicle

కల్వకుర్తిలో మన ఇసుక మన వాహనం పేరుతో విచ్చలవిడిగా అక్రమ రవాణా


*సాక్షిత ప్రతినిధి. : కల్వకుర్తి పట్టణంలో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా. 100 కాల్ చేసిన పట్టించుకోని అధికారులు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమ ఇసుక రవాణా దారులు. లక్షల్లో కాసులు కురిపిస్తున్న అక్రమ ఇసుక రవాణా. భారీ వర్షాలకు వాగుల్లో నీరు ప్రవహిస్తున్న అక్రమ ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదు.

జెసిబి లతో తవ్వి రవాణా చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా అధికారులు నాయకుల అండదండలతో రాత్రి పగలు అక్రమ ఇసుక కోసం వాగును జల్లెడలతో నీటిలో నుంచి ఇసుక తీసి సమీపంలో నిల్వ చేసుకుంటున్నారు. రాత్రంతా భారీ యంత్రాలతో నీటిలో నుంచి ఇసుక తీసి సమీపంలో నిలువ చేసుకుంటున్నారు.

పగలు వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ రూపాయలు లక్షలు గడిస్తున్నారు వాగుల్లో నీరు ఉందని ఇసుక లభించడం లేదంటూ ప్రచారం చేస్తూ5000. నుండి6000 రూపాయల వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కల్వకుర్తి. నియోజకవర్గం పరిధిలో దుందుభి వాగు పరిసర గ్రామాల నుంచి నిత్యం వందల ట్రాక్టర్లో ఇసుకను తోడేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నాడు అడ్డుకొని నేడు రవాణా. కొన్నేళ్ల కిందట వాగులో ఇసుక తీయడంలో భూగర్భ జలాలు తగ్గి పోతున్నాయని దుందుభి పరసాల గ్రామాల రైతులు పాలకులు ఇసుక రవాణాను అడ్డుకున్నారు. దీంతో తీరువ కరువు పరిస్థితుల్లోను ఇక్కడ సాగుకు బోరు బావుల ద్వారా నీరందేది ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉండడంతో చాలామంది రైతులు పాలకులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ఓ శాఖకు చెందిన అధికారులకు నెలసరి మామూలు మూట చెబుతూ అక్రమ రమణా సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

వంగూరు మండలం ఉల్పర వద్ద వాగులో కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ చెందిన వ్యక్తులు రాత్రిపూట పెద్ద యంత్రాలతో ఇసుకను తీసి ఎల్లికల్ పరిసరాల ప్రాంతంలో రహస్యంగా డంపింగ్ చేసుకొని మన ఇసుక మన వాహనము అంటూ పట్టపగలే దర్జాగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు.

పగటిపూట ట్రాక్టర్ల ద్వారా కల్వకుర్తి తో పాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు కల్వకుర్తి మండలంలోని గుండూర్ సుద్ధకల్. ఎల్లికల్. ఎల్లికట్ట నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను రవాణా చేస్తున్నాయి.అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడడంతో నామమాత్రంగా జరిమానా విధించి వదిలేస్తున్నారు.

నీటిలో నుంచి తీసిన ఇసుక కావడం అధిక లోడుతో మితిమీరిన వేగంతో ట్రాక్టర్లు వెళ్తుండడంతో బీటీ దారులన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. డ్రైవర్లలో అధిక మంది మైనర్లే ఉంటున్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల కు నెంబర్ ప్లేట్లు ఉండడం లేదు.

సంబంధిత శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు అక్రమ ఇసుక రవాణాతో ప్రభుత్వం భారీ ఆదాయాన్ని కోల్పోతుంది అధికారులు స్పందించి అక్రమ రవాణా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page