వ్యవసాయం దండుగ అని, ఉచిత విద్యుత్ ఇస్తామంటే కరెంట్ తీగలు మీద బట్టలు ఆరవేసుకోవలి

Spread the love


If agriculture is danduga, free electricity means clothes should be hung on electric wires

వ్యవసాయం దండుగ అని, ఉచిత విద్యుత్ ఇస్తామంటే కరెంట్ తీగలు మీద బట్టలు ఆరవేసుకోవలి అని హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు : ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

సాక్షిత : రైతుల మీద తెలుగు దేశం నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారు అని శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 13వ వార్డ్ లో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వార్డ్ లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి మూడేళ్ల జగనన్న పాలనలో జరిగిన మేలును వివరించారు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ… రైతుల సంక్షేమం గురించి టిడిపి నేతలు మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు. వ్యవసాయం దండుగ అని, ఉచిత విద్యుత్ ఇస్తామంటే కరెంట్ తీగలు మీద బట్టలు ఆరవేసుకోవలి అని హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్ర బాబు, కరువు కవలపిల్లలని అభివర్ణించారు. జగన్ పాలనలో ఒక్క కరువు మండలం కూడా లేదని గర్వంగా చెబుతున్నాం అన్నారు

రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం అన్నారు.రైతులకు అవసరమైన అన్ని గడప వద్దకే అందిస్తున్నామన్నారు. బాబు హయాంలో కంటే ఇప్పుడు 14 లక్షల టన్నుల ధాన్యం పండించడం జరిగింది అన్నారు

రైతుల ఆత్మహత్యల గురించి ఏ వేదిక పైనైనా చర్చిందనికి సిద్దం అని స్పష్టం చేశారు. ఎవరి హాయంలో రైతులు ఎక్కువగా నష్టపోయారో చర్చిద్దాంమన్నరు

ప్రకృతి విపత్తులను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు . ప్రకృతి విపత్తుల సమయంలో 45 రోజుల్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. 3 ఏళ్లలో రైతుల వద్ద నుంచి ఈ క్రాప్ ద్వారా దాన్ని కొనుగోలు చేసిన ఘనత మన ప్రభుత్వంది అన్నారు

బేషరతు పూర్తి రుణమాఫీ చేస్తామని చంద్ర బాబు ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా రూ.13500 రైతు భరోసా ఇస్తున్నామన్నారు

Related Posts

You cannot copy content of this page