బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు

Spread the love

వర్థన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పుంచుకుంటుంది
నాయకుడే ఒక సేవకుడి లాగా పని చేస్తున్న తరుణంలో ప్రజలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు…

హనుమకొండ జిల్లా….

హనుమకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు 46వ డివిజన్ మడికొండ ఆదర్శకాలనీ నుంచి డివిజన్ కాంస్టెస్టెడ్ కార్పొరేటర్ వస్కుల శంకర్, డివిజన్ అధ్యక్షుడు వస్కుల నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 100 మందిని కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాత కొత్త అనే విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు 46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..

Related Posts

You cannot copy content of this page