అధికారుల తో సమీక్షా సమావేశం జరిపిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

Spread the love

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ ,హైదర్ నగర్ ,కూకట్పల్లి పార్ట్ డివిజన్ల పరిధిలోని పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ఈ రోజు కూకట్పల్లి జోనల్ కార్యలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవ గౌరవ జోనల్ కమిషనర్ శ్రీమతి మమత గారు, గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి రోజాదేవి రంగరావు గారు, శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు మరియు GHMC ఇంజనీరింగ్ విభాగం,శానిటేషన్, టౌన్ ప్లానింగ్ మరియు ఇతర అధికారుల తో సమీక్షా సమావేశం జరిపిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్త పరిచారు ,పారిశుధ్య కార్మికుల గైరాజరు విషయం మా దృష్టికి వచ్చిందని, పని చేయని కార్మికులను SFA , SRP లు వెనుకేసుకురావడం సరైన విధానము కాదని హెచ్చరించారు.పారిశుధ్య నిర్వహణలో లోపాలను సరిదిద్దకుంటే రాబోయే వర్షాకాలం సమయం లో స్థానికులు మరింత ఇబ్బందులకు గురికాక తప్పదని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలిపారు .దోమల బెడద అత్యధికం గా అయినది అని, దానికి తగువిధం గా చర్యలు తీసుకోవాలి హెచ్చరించారు అభివృద్ధి పనులను చేపట్టడం లో జరిగిన జాప్యాన్ని సహించేదిలేదని అన్నారు .వివిధ ప్రాంతలలో జరుగుతున్న స్మశాన వాటికల నిర్మాణ పనులు నత్త నడకలో ఉనందున వాటిని త్వరితగతిలో పూర్తి చేయాలనీ సూచించారు , హిందూ , ముస్లిం మరియు క్రిస్టియన్ల కొరకు ప్రత్యేకంగా ఎల్లమ్మబండ లో నిర్మిస్తున్న స్మశాన వాటిక పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటు లోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలిపారు అలాగే వివేకానందనగర్ లో స్మశాన వాటిక అభివృద్ధి పనులను పూర్తి చేయాలనీ చెప్పారు నిజాంపేట్ లోగల మైఫిల్ హోటల్ దగ్గర నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతయినా ఉందని అన్నారు . రాబోయే వర్షాకాలం ను దృష్టి లో పెట్టుకొని లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా తగు చర్యలు తీసుకోవాలని ,మరియు నిజాంపేట్ సూపర్ మార్కెట్ హైదర్ నగర్ వద్ద అభివృద్ధికి ఆటంకం గా ఉన్న కోర్ట్ కేసు విషయం ఫై దృష్టి పెట్టాలని తెలియజేసారు .
ఇప్పట్టి వరుకు మంజూరి అయిన అభివృద్ధి పనులకు టెండర్ విధానం పూర్తి చేసి త్వరితగతి లో పనులు ప్రారంభించాలని అన్నారు . విధి దీపాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మరియు
చెరువుల సుందరీకరణ అభివృద్ధి పనులను సమీక్షిస్తూ వచ్చే వర్షాకాలం లోపల మురుగు నీరు మల్లింపు పనులను పూర్తి చేసి చెరువులను కాలుష్య నివారణకు గురికాకూండా మురుగు నీరు కాలువల గుండా తరలింపు పనులను వేగవంతం చేయాలనీ భీముని కుంట ,అలీ తలాబ్ , ఎల్లమ్మ చెరువు , అంబిర్ చెరువు మరియు కింది కుంట చెరువుల సుందరీకరణ పనులను వేగవంతం చేయాలనీ ప్రభుత్వ విప్ గాంధీ గారు సూచించారు . అభివృద్ధి పనులను చేయడం లో నెలకున్న నిర్లక్ష్యాన్ని ప్రజలు సహించారని గౌరవ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట చంద్ర శేఖర్ రావు గారు మరియు గౌరవ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామ రావు గారు దిశ నిర్ధేశం లో మంజూరు చేసిన నిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాని ఆ నిధులను సద్వినియోగం పరుచుకొని అభివృద్ధి పనుల ఫలితాలని ప్రజలకు త్వరితగతిన అందిచాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేశారు. అదేవిధంగా
వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అభివృద్ధి చేపట్టే దిశగా ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది అని , అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని,పెరుగుతున్న జనవాసాల దృష్ట్యా మౌలిక వసతులు కలిపించాలని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, GHMC అధికారులు SE చిన్నారెడ్డి, EE గోవర్ధన్ AE లు రాజీవ్, శివప్రకాశ్,శ్రావణి, ఆశ , టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ ఉమాదేవి, ACP రాణి , TPSలు సోమేశ్, శ్రీనివాస్ AMOH మమత ,ఇరిగేషన్ AE విశ్వం, స్ట్రీట్ లైట్స్ AE మృదుల, SRP సత్యనారాయణ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page