ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోళీ సంబురాలు

Spread the love

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత న్యూస్

ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం హోళీ సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లు ఆటాపాటలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. హోళీ పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోళీ పండుగ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని, సాంప్రదాయబద్దంగా, రసాయన రహిత రంగులతో జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి జీవితం ఇంద్రధనుస్సులో ఉండే సప్తవర్ణ శోభితం కావాలని వారు తెలిపారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page