మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్

Spread the love

Gokul Plots under Madapur Division

మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ , మాతృ శ్రీ నగర్, శిల్ప పార్క్,చంద్రనాయక్ తండా, అయ్యప్ప సొసైటీ కాలనీ లలో రూ.4 కోట్ల 58 లక్షల 50 వేల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు ఓపెన్ జిమ్ లకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని, కాలనీ లలో వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల ను పునరుద్ధరించడమే ధ్యేయం గా సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని, అన్ని కాలనీ లలో మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, అన్ని రకాల మౌలిక వసతుల తో, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

గోకుల్ ప్లాట్స్ కాలనీ లో రూ.279.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు

మాతృ శ్రీ నగర్ కాలనీ లో రూ.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే ఫూట్ ఫాత్ మరియు టేబుల్ డ్రైన్ నిర్మాణ పనులకు

శిల్ప పార్క్ కాలనీలో రూ.18.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు

చంద్ర నాయక్ తండా, సాయి నగర్, అయ్యప్ప సొసైటీ కాలనీల లో రూ.111 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్లు మరియు ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు
శంకుస్థాపన చేయడం జరిగినది.

పైన పేర్కొన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని,ఓపెన్ జిమ్ లను ప్రారంభించడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం ,సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు ,పెద్దలు , వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు, పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగినది అని. అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు


రాబోయే రోజులలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని కాలనీ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని , ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామలు చెయ్యటం ఎంతో అవసరమని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని, ఆరోగ్యమే మహా భాగ్యం అని, కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని గౌరవ ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షులు ఈ శ్రీనివాస్ గౌడ్,హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్,గోకుల్ ప్లాట్స్ బిఆర్ఎస్ బస్తి అధ్యక్షులు బి.శ్రీనివాస్,జనరల్ సెక్రటరీ సాంబశివరావు,ఎస్.సి సెల్ అధ్యక్షులు రఘునాథ్,డివిజన్ నాయకులు అన్వర్ షరీఫ్,ఎంవివి నారాయణరెడ్డి,వార్డ్ సభ్యులు గుమ్మడి శ్రీనివాస్,పితాని లక్ష్మీ,రామచందర్,తైలి కృష్ణ,కేశవులు,మోహన్,కృష్ణ రెడ్డి,పితాని

శ్రీనివాస్,ప్రసాద్,రామ్మోహన్,సురేష్,చౌదరి,నీలకంఠ,మూర్తి,అనిల్ కావూరి,వెంకట్ రెడ్డి,లాలూ నాయక్,హున్య నాయక్,నర్సింహ,రాములు,జైపాల్,సుబ్రమణ్యం,శ్రవణ్,శ్రీనివాస్ రెడ్డి,నవీన్,రాజేష్,రాజు,సత్తిరెడ్డి,ప్రవీణ్,కుమార్,నవీన్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page