నల్లగండ్ల మార్కెట్ లో నిర్వహించిన గ్యార్వి షరీఫ్ ముబారక్

Spread the love

Garvi Sharif Mubarak organized in Nalgandla market

సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ పరిధి నల్లగండ్ల మార్కెట్ లో నిర్వహించిన గ్యార్వి షరీఫ్ ముబారక్ లో భాగంగా అన్నదాన కార్యక్రమంలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నిర్వాహకులు కార్పొరేటర్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ముస్లిం సోదరులకు అన్నప్రసాదములను వడ్డించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్యార్వి షరీఫ్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ స్మారకార్థం ఇస్లామిక్ సూఫీ పండుగ. అతను ఖాద్రీ తారీఖా యొక్క శ్రేయోభిలాషి, మొత్తం ప్రపంచంలో వర్ధిల్లుతున్నాడు.

సూఫీ కమ్యూనిటీ ప్రతి సంవత్సరం 11వ రబీ-అల్-ఆఖిర్ లేదా ఇస్లామిక్ చంద్ర నెల 11వ రోజున ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు అని అన్నారు.

ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు వీరేషం గౌడ్, అబీబ్, లక్ష్మి నారాయణ గౌడ్, వార్డు మెంబెర్ కవిత, గోపాల్ కృష్ణ, రాంచందర్, ఖాజాపాషా, గాఫర్, షరీఫ్, ముస్తఫా, కరీం, షైక్ అహ్మద్, శ్రీనివాస్, రాజు, లాల, గోపాల్ యాదవ్, బస్వరాజ్ లింగయత్, మహేష్ రాపన్, మార్కెట్ అసోసియేషన్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page