హైదరాబాద్, : కేంద్ర మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు చేరుకున్నారు. 91 కింద నోటీసులు ఇస్తామని గాంధీభవన్ సిబ్బందికి అధికారులు తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు ఇవ్వగా అందులో నలుగురు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
కాగా.. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని కేంద్రమంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసింది. దీనిపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపై స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ (IFSO) దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే గాంధీభవన్‌కు వచ్చిన ఢిల్లీ పోలీసులు.. సోషల్ మీడియా ఇంచార్జ్‌కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని కర్ణాటక సభలో ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే..