దేశ ఆర్ధిక రంగ పితామహుడు, తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర సన్మానం భారతరత్నను ప్రకటించడం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు.
దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి పీవీ అని, సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడని అన్నారు.
పీవీ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానికి భారతరత్న ఇవ్వాలని అనేక మార్లు బిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన విషయం గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు పీవీ స్ఫూర్తిదాయకమని, వారికి భారతరత్న ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి పువ్వాడ ధన్యవాదాలు తెలియజేశారు.
మాజీ ప్రధాని పీవీ కి భారత రత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ మంత్రి పువ్వాడ.
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…