చంద్రబాబు నాయుడు పైన సీఐడీ పస లేని కేసులను సూటిగా ప్రశ్నించిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్

Spread the love

చంద్రబాబు నాయుడు గారి పైన సీఐడీ పస లేని కేసులను సూటిగా ప్రశ్నించిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి తాజాగా రాజీనామా చేశారు.

స్కిల్ డెవలప్మెంట్ విషయంలో దొంగ కేసు పెట్టి,
మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయటం కరెక్టు కాదని
పీవీ రమేష్ అన్న మాటలు సిఐడి కేసులో గాలిని తీసేశాయి.

అందుకే హైదరాబాద్ లో దిగీదిగగానే
జగన్రెడ్డి నుంచి రియాక్షన్ వచ్చింది.

రిటైర్మెంట్ తర్వాత మేఘా కంపెనీలో సలహాదారుగా పీవీ రమేష్ ఉన్నారు.జగన్ రెడ్డి
కోరిక మేరకు ఆయన్ని రిజైన్ చేయాలని వాళ్లు అడిగారు.
ఆయన వెంటనే, అంటే నిన్న, రిజైన్ చేశారు.

వాస్తవానికి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది.
ఈ మేరకి ప్రత్రికలకి సమాచారం ఇచ్చారు.

ఆ వెంటనే జగన్ రెడ్డి నుంచి మేఘాకి, మేఘా నుంచి ఆయనకి ఫోన్ వచ్చింది.

ప్రెస్ మీట్ పెట్టొద్దని వాళ్లు చెప్పారు. ఆయన ఒప్పుకోలేదు.
అలాగయితే తమదగ్గర కొనసాగడం కష్టం అని చెప్పారు.

ఉద్యోగం నుంచి వైదొలగడానికి ఆయన సంసిద్ధులయ్యారు.

ఈ మేరకు నిన్న సాయంత్ర ఆయన రాజీనామా లేఖని సమర్పించారు.

డబ్బు, రాజకీయ అధికారంతో పాటు రక్త చరిత్ర ఉంటే అన్ని వ్యవస్థల మీద తిరుగులేని ఆధిపత్యం సంపాదించవచ్చని జగన్ రెడ్డి పాలన ఋజువు చేస్తోంది.

మేఘా ఇంజనీరింగ్ కంపెనీ శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డిలది. వాళ్లు పట్టిసీమ పని చేసినప్పుడు, చంద్రబాబుతో కలిసి డబ్బులు తిన్నారని జగన్ ఆరోపించాడు.

అధికారంలోకి వచ్చాక, బేరం మాట్లాడుకొని, పోలవరంతో సహా ఎన్నో కాంట్రాక్టలు ఇచ్చాడు.

మేఘా ద్వారా టీవీ 9, ఎన్టీవీల్లో వాటాలు కొనిపించి, వాళ్ల మీద ఆధిపత్యం సంపాదించాడు.

ఇప్పుడు జగన్ ఆదేశాల ప్రకారం, తమ సంస్థలో సలహాదారుగా ఉన్న పీవీ రమేష్ రిజైన్ చేయించాడు.

Related Posts

You cannot copy content of this page