కాలుష్యకారక పరిశ్రమను ఏర్పాటు చేయవద్దంటూ

Spread the love
Farmers' dharna on the road demanding not to set up polluting industry
కాలుష్యకారక పరిశ్రమను  ఏర్పాటు చేయవద్దంటూ రహదారిపై  రైతుల  ధర్నా.!*


షాద్ నగర్ పరిగి రహదారిపై  ఆందోళన  చేపట్టిన రైతులు.
కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు వద్దంటూ నినాదాలు..
!  
రంగా రెడ్డి జిల్లా సాక్షిత బ్యూరో ప్రతినిధి:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కొందుర్గు మండలం రాంచంద్రపురం పులుసుమామిడి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు షాద్ నగర్ పరిగి రహదారిపై రాంచంద్రపురం వద్ద  రైతులు రోడ్డుపై వాహనాలను ఆపి ధర్నా చేపట్టారు తమ గ్రామాల వద్ద కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో తమకు తెలిసిందని ప్రజా భిప్రయ సేకరణలో తాము పూర్తిగా వ్యతిరేకించమని అయినా కూడా బలవంతంగా ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతుందని 


 ఇప్పటికే ఇక్కడ కాలుష్యకారక పరిశ్రమల వల్ల పంటలు పండక రైతన్నలు నష్టపోతున్నారని కాలుష్యం బారిన పడి మనుషులకే కాక మూగజీవులు కూడా మృత్యువాత పడుతున్నాయ్యాని   రైతన్నలు వాపోతూ ధర్నాకు దిగారు ఈ ఈ కార్యక్రమంలో రైతులు దర్గా వెంకటేష్, రెడ్డి నరసింహులు దర్గా నర్సింలు శ్రీనివాస్ చిన్నయ్య సత్యనారాయణ భాస్కర్ గౌడ్ నర్సింలు రవి గౌడ్ మల్లేష్ జహంగీర్ శివ మైపాల్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మానయ్య రామచంద్రయ్య నర్సింలు ఎల్లయ్య జంగయ్య నర్సింహారెడ్డి రాములు, శ్రీశైలం గణేష్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page