నా ప్రతి చెమట చుక్క నిరుపేద ప్రజల కోసమే ఐక్యత ఫౌండేషన్ సేవలు ఆగవునా ప్రాణం

Spread the love

Every drop of my sweat is for the needy people, even if the services of the Unity Foundation stop

నా ప్రతి చెమట చుక్క నిరుపేద ప్రజల కోసమే ఐక్యత ఫౌండేషన్ సేవలు ఆగవునా ప్రాణం ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తా*సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

సాక్షిగా ప్రతినిధి

అభివృద్ధికి నోచుకోని కల్వకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాసుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.
ఒక్క అవకాశం ఇవ్వండి కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా.

-ఇప్పటికే ఐక్యత ఫౌండేషన్ ద్వారా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు అంబులెన్సులు ఆమనగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు అంబులెన్సులు ఉచితఅంబులెన్స్ సౌకర్యాలు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి మెరుగైన పాలన అందించడమే తన లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సకలజనుల భద్రత, ప్రజా సంక్షేమ కల్వకుర్తి నిర్మాణమే నా ధ్యేయం అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి , ఉద్యోగం, వ్యవసాయం కోసం ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొనేందుకు మీ ముందుకు వస్తున్నానని కల్వకుర్తి నియోజకవర్గం లోని ప్రజల సమస్యలు తెలుసుకొని ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను అని సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి నేటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు చూపిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతానని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం ఇప్పటివరకు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని,ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయారని, నాకు ఒక అవకాశం ఇస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి ప్రజా సంక్షేమ పాలన అందిస్తానని అన్నారు.

కార్మికులు, కర్షకులు, కూలీలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దగ్గరగా చూసేందుకు, కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల కన్నీళ్లు తుడిచి నేనున్నానని ధైర్యం ఇచ్చేందుకు మీ ముందుకు వస్తున్నానని అన్నారు., సంక్షేమ పాలన కల్వకుర్తిలో గడపగడపకు తెచ్చేందుకు కృషి చేస్తానని చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఆరు నెలల నుండి ఇప్పటివరకు కల్వకుర్తి నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేస్తూ, ఆర్థికంగా ఆదుకుంటూ,

యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు క్రీడలు నిర్వహిస్తూ, కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుపేద ప్రజలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి, ఆర్థిక స్తోమత లేని వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా తన ఐక్యత ఫౌండేషన్ ద్వారా అంబులెన్స్లను ఏర్పాటు చేశారు, యువకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు, ఆమనగల్లులో మూడు, అంబులెన్స్లని ఏర్పాటు చేసి, ఐక్యత ఫౌండేషన్ ద్వారా వాళ్ళు సేవలు అందిస్తున్నానని అన్నారు.

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పించి కల్వకుర్తి నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పంపిస్తే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటానని కూడా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

Related Posts

You cannot copy content of this page