కందాళ ఫౌండేషన్ లో పోలీస్ కానిస్టేబుల్ /ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్

Spread the love
Events for Police Constable / SSI Candidates under the auspices of Kandala Foundation

కందాళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ /ఎస్సై అభ్యర్థుల ఈవెంట్స్ కొరకు క్రీడా మైదానం ఏర్పాటు


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండల కరెంట్ ఆఫీస్ ఎదురుగా మైదానంను ప్రారంభించనున్న పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ఎస్సై /కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ ప్రాక్టీస్ కొరకు క్రీడా మైదానం కొరత ఉండడంతో విషయం తెలుసుకుని స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో క్రీడా మైదానం ఏర్పాటు చేశారు.


క్రీడామైదానం లో అనుభవం కలిగిన శిక్షకులతో (ట్రైనర్స్ తో) రన్నింగ్ తో పాటు లాంగ్ జంప్ మరియు షార్ట్ పూట్లో సలహాలు సూచనలు అందిస్తారు.


ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం రెండుపూటలా ట్రైనర్స్ అందుబాటులో ఉండి సలహాలు సూచనలు అందిస్తారు. కందాళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ద్వారా క్వాలిఫై అయిన 260 మంది అభ్యర్థులుతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు రేపటి నుండి మైదానాన్ని వినియోగించుకోవచ్చునని ప్రకటనలో తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page