బొకేలకు బదులు నోట్ పుస్తకాలు ఇవ్వాలన్నా విద్యా మంత్రి పిలుపు

Spread the love


Education Minister calls to give note books instead of bouquets

బొకేలకు బదులు నోట్ పుస్తకాలు ఇవ్వాలన్నా విద్యా మంత్రి పిలుపుకు ముందుకువచ్చిన ఓయూ విద్యార్థి నేత,టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్.


సాక్షిత : నూతన సంవత్సర సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాలువాలు, బొకేలకు బదులుగా పుస్తకాలతో రావాలన్న పిలుపు మేరకు దివంగత నేత పట్లోళ్ళ ఇంద్రా రెడ్డి చరిత్ర, వారు ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన కృషి, వారు చేసిన ఉద్యమతీరును పొందు పరిచిన మెటీరియల్ తో ఓయూ పరిశోధక విద్యార్థి,రాష్ట్ర టిఆర్ఎస్వి కార్యదర్శి దశరథ్ రూపొందించిన నోట్ పుస్తకాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

ఆ మహానీయుని చరిత్ర నేటి సమాజానికి తెలిపే ప్రయత్నంలో భాగంగా చేవెళ్ళ ప్రాంతంలోని పాఠశాలల్లో ఈ పుస్తకాలు పంచడం జరుగుతుందని ఈ సందర్భంగా దశరథ్ తెలిపారు. తన పిలుపుకు స్పందించి విద్యార్థులు సైతం ముందుకు రావటం అభినందనీయమని ఈ సందర్భంగా దశరథ్ ను మంత్రి అభినందించారు.

Related Posts

You cannot copy content of this page