హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో తలెత్తిన డ్రైనేజి సమస్యను

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో తలెత్తిన డ్రైనేజి సమస్యను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ మిత్ర హిల్స్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో పర్యటించడం జరిగినది అని , కాలనీ లో నెలకొన్న డ్రైనేజి సమస్యను పరిష్కరించడానికి బకెట్ క్లినింగ్ చేపట్టాలని, మ్యాన్ హోల్ నుండి ప్రతి మ్యాన్ హోల్ వరకు బకెట్ క్లినింగ్ ద్వారా మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన పూడికను తీయాలని, అదేవిధంగా డ్రైనేజి నీరు ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ప్రతి మ్యాన్ హోల్ వద్ద పూడిక తీత తీయాలని, మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన చెత్త చెదారం ను తీసి వేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఎక్కడ డ్రైనేజి సమస్యాత్మక ప్రాంతంగా నిత్యం పొంగే ప్రదేశాలలో, కాలనీ లలో ప్రథమ ప్రాధాన్యత గా బకెట్ క్లినింగ్ పెట్టి సమస్యను పరిష్కరించాలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడే పరిష్కారం చేయాలని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని జలమండలి అధికారులకు తెలియచేయడం జరిగినది అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అదేవిధంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి గాని కార్పొరేటర్ కార్యాలయం దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్ హైదర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్ కాలనీ వాసులు శ్రీనివాసన్, కమలాకర్, సత్యనారాయణ, రమేష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page